బుల్స్‌పై డామినేషన్ కోసం బేర్స్ ట్రయల్స్..! 15750కి చేరువలో నిప్టీ! అదానీ పోర్ట్స్ కి నాలుగో నష్టాల సెషన్

2021-06-17 10:25:39 By Anveshi

img

స్టాక్ మార్కెట్లలో వరస లాభాల సెషన్స్‌కి నిన్న బ్రేక్ పడగా, ఇవాళ కూడా అదే ట్రెండ్ కొనసాగించేందుకు బేర్స్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ నిన్నటి ముగింపు కంటే తక్కువగానే ఇంట్రాడే హై మార్క్ దగ్గరకు మాత్రమే నిఫ్టీ వెళ్లగలిగింది. ఐతే ఉదయం పది గంటలకు మాత్రం నిఫ్టీ 15734 పాయింట్ల వరకూ బౌన్స్ అవడంతో తిరిగి పోటాపోటీ వాతావరణం నెలకొన్నట్లు కన్పిస్తోంది. ఓపెనింగ్‌లోనే గత ముగింపు కంటే 120 పాయింట్లకిపైగా నష్టపోయి నిఫ్టీ 15648 పాయింట్లకు పడిపోగా, తర్వాత షార్ప్‌గా రియాక్టైంది. మధ్యాహ్నానికి ట్రెండ్ డిసైడయ్యే ఛాన్స్ కన్పిస్తోంది 

 

మరోవైపు సెన్సెక్స్ కూడా ఓపెనింగ్‌లోనే దాదాపు 400 పాయింట్లు కోల్పోగా, ప్రస్తుతం ఆ నష్టాలను పూడ్చుకుని 52402  పాయింట్లకు బౌన్స్ బ్యాక్ అయింది

 

నిఫ్టీ బ్యాంక్ వరసగా రెండో రోజూ నష్టపోతుండగా, ఐటీ స్టాక్స్ ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయ్, ఆటో,కేపిటల్, మిడ్ క్యాప్ స్టాక్స్  నష్టాల్లో ట్రేడవుతున్నాయ్. కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, స్మాల్ క్యాప్ స్టాక్స్ మాత్రమే కాస్త లాభాల్లో  ట్రేడవుతున్నాయ్. మెటల్ స్టాక్స్ నష్టాలే ఎక్కువగా నిఫ్టీని నష్టపరుస్తుండగా, టాటాస్టీల్‌కి ఇది వరసగా మూడో నష్టాల సెషన్

 

నిఫ్టీ గెయినర్లలో ఏషియన్ పెయింట్స్ వరసగా రెండో రోజు లాభపడింది. అల్ట్రాటెక్ సిమెంట్, నెస్లే, శ్రీ సిమెంట్స్, టాటా మోటర్స్ 1శాతం నుంచి అరశాతం వరకూ లాభపడ్డాయ్. నిఫ్టీ లూజర్లలో అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, హిందాల్కో,  హీరోమోటోకార్ప్,హెచ్‌డిఎఫ్‌సి 2.44శాతం నుంచి 0.80శాతం నష్టపోయాయ్. అదానీ పోర్ట్స్ కి వరసగా ఇది నాలుగో నష్టాల సెషన్


adani ports tatasteel nifty 15750 rally down telugu profit