లాభాలతో ఆరంభం ట్రేడింగ్,15వేల పాయింట్లపై కన్నేసిన నిఫ్టీ! గ్రాఫైట్ స్టాక్స్‌లో ర్యాలీ కంటిన్యూస్

2021-04-08 09:43:55 By Anveshi

img

స్టాక్ మార్కెట్లు గురువారం పాజిటివ్‌గా ప్రారంభమైంది. నిఫ్టీ 110 పాయింట్ల లాభంతో 14929 పాయింట్ల వద్ద, సెన్సెక్స్ 370 పాయింట్ల లాభంతో  50032 పాయింట్ల వద్ద ట్రేడ్ అయ్యాయ్.  దీంతో  వరసగా మూడో సెషన్‌ కూడా పాజిటివ్‌గా  ట్రేడవుతుండటం గమనిస్తుంటే, వైరస్ వర్రీని మార్కెట్లు పెద్దగా భయపెడుతున్నట్లు కన్పించడం లేదు. నిఫ్టీ బ్యాంక్, ఐటీ  ర్యాలీని లీడ్ చేస్తుంటే, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ స్టాక్స్‌లో కొనుగోళ్లు భారీగా చోటు చేసుకుంటున్నాయ్.ప్రతి ఒక్క రంగం ఇవాళ్టి లాభాల మార్కెట్లకు మద్దతు ఇస్తున్నట్లు ఎర్లీ ట్రేడ్‌ని బట్టి అర్ధమవుతోంది. 

అర్ధమవుతోంది. ఇవాళ్టి ఈ మూడ్ ఇదే రీతిలో కంటిన్యూ అయితే నిఫ్టీ మరోసారి 15వేల పాయింట్ల మార్క్‌ని అందుకోవచ్చనే అంచనాలు ఏర్పడ్డాయ్ 

నిఫ్టీ  గెయినర్లలో టాటా స్టీల్, టెక్ మహీంద్రా, హిందాల్కో,విప్రో, బజాజ్ ఫిన్ సర్వ్ 2.01శాతం నుంచి 1.54శాతం లాభపడ్డాయ్

నిఫ్టీ లూజర్లలో బజాజ్ఆటో, ఓఎన్‌జిసి, నెస్లే, బ్రిటానియా అరశాతం నుంచి అతి స్వల్ప నష్టాల్లో ట్రేడయ్యాయ్. 

ఇక  నిన్నటి ర్యాలీని ఇవాళ కూడా గ్రాఫైట్ స్టాక్స్ కంటిన్యూ చేస్తున్నాయ్. హెచ్ఈజీ 9శాతం, గ్రాఫైట్ ఇండియా 10.68శాతం లాభపడ్డాయ్. 

Expert's View


WHAT IS BITCOIN ? HOW TO INVEST IN CRYPTO CURRENCY ?

Trending