అదే పోత..ఎదురు చూస్తున్న కరెక్షన్ వచ్చేసిందా..? ఆల్‌టైమ్ హై నుంచి 300 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ..!అదానీ పోర్ట్స్‌కి కాస్త బయింగ్ సపోర్ట్

2021-06-18 11:09:12 By Anveshi

img

స్టాక్ మార్కెట్లలో బేర్స్  ఎదురు చూస్తున్న తరుణం వచ్చేసిందా, లేక కన్సాలిడేషన్ దశలోకి ఎంటరైందా అనే రెండు ప్రశ్నలు  ఇవాళ్టి ఓపెనింగ్‌ చూస్తే అర్ధమవుతోంది. ఐతే ఇంట్రాడే హై మాత్రం నిన్నటి ముగింపు కంటే 70 పాయింట్లు ఎక్కువ కావడంతో, కరెక్షన్ మోడ్‌లోకి నిఫ్టీ వెళ్లిందని అప్పుడే చెప్పలేని పరిస్థితి, ఓపెనింగ్‌లో పాజిటివ్‌గా కన్పించినా 100 పాయింట్లకు  పతమనైన నిఫ్టీ ఆ తర్వాత  అంతకంతకూ కిందికి దిగిపోయింది. ఇంట్రాడేలో 15534 పాయింట్లకు పతనమైన నిఫ్టీ, బౌన్స్  బ్యాక్ అయ్యే ఛాన్సులు తక్కువగానే కన్పిస్తున్నాయ్.

 

అటు సెన్సెక్స్ కూడా 51844 పాయింట్లకు ఫ్రెష్‌గా పడిపోయింది. ఓపెనింగ్‌లోనే 400 పాయింట్లు కోల్పోగా, ఆ డౌన్ ట్రెండ్  కొనసాగుతోంది. ప్రస్తుతం 51850 పాయింట్ల వద్ద కొట్టుమిట్టాడుతోంది. సెన్సెక్స్ మాత్రం నిన్నటి క్లోజింగ్ 52323 కంటే  ఎక్కువగా 52586 పాయింట్లకి ఎగసి, కిందికి జారడం గమనార్హం. మొత్తంగా ఈ స్వింగ్ 600 పాయింట్లుగా నమోదు కావడం, ట్రేడింగ్‌లో నెలకొన్న ఒడిదుడుకులకు నిదర్శనం

 

ఐటీ, బ్యాంక్ నిఫ్టీ. స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్‌లో హెవీ సెల్లింగ్ కన్పిస్తోంది. మెటల్స్ మెల్ట్ కాగా, ఆయిల్ కారిపోతోంది. మొత్తంగా ఎఫ్ఎంసిజి, టెక్ షేర్లకు మాత్రమే స్వల్ప నష్టాలు వాటిల్లుతుండగా అన్ని రంగాల షేర్లకు ఇవాళ నష్టాలపాలు కావడం శుక్రవారం ట్రేడింగ్ హైలైట్

 

ఇక నిప్టీ గెయినర్లలో అదానీ పోర్ట్స్ లీడ్ చేస్తుండగా, బజాజ్ ఆటో, హెచ్‌యుల్, సిప్లా, డా.రెడ్డీస్ ల్యాబ్స్ 0.78 నుంచి  0.37శాతం లాభపడ్డాయ్. లూజర్లలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 4.08శాతం, ఓఎన్‌జిసి 3.56శాతం పవర్ గ్రిడ్ 3.36శాతం, టాటా స్టీల్ 3.28శాతం, టాటామోటర్స్ 3.02శాతం నష్టపోయాయ్

 

అదానీ పోర్ట్స్‌‌ స్టాక్‌కి వరసగా నాలుగు సెషన్లలో అమ్మకాల సునామీలో కొట్టుకుపోతుండగా ఇవాళ కాస్త బ్రేక్ పడినట్లుంది.  హయ్యర్ లెవల్స్ లో అమ్మేసినవారు, తిరిగి ఇందులో వేల్యేషన్ ఉందనే నమ్మకంతోనే కాస్త బయింగ్‌కి దిగినట్లు అర్ధం  చేసుకోవాలి. ప్రస్తుతం అదానీ పోర్ట్స్ స్టాక్ ధర రూ.650 వద్ద ట్రేడ్ అయింది. ఇంట్రాడేలో 664కి కూడా ఎగసింది. ఐతే ఈ కౌంటర్
తిరిగి నష్టాల్లోకి జారుతున్న ట్రెండ్ కన్పిస్తోంది.

 


nifty down sensex fall correction adani ports