నష్టాలతో ముగింపు,14500 దిగువన నిఫ్టీ క్లోజ్ ! కేక పుట్టించిన బజాజ్ హెల్త్‌కేర్ షేర్లు..! యాంటీ వైరల్ ట్యాబ్లెట్ల లాంఛింగ్‌తో తెగ జోరు

2021-05-04 15:33:36 By Anveshi

img

ఒడిదుడుకుల మధ్య స్టాక్ మార్కెట్లు నష్టాలతో మంగళవారం నష్టాలతో ముగిశాయ్. ఓపెనింగ్‌ పాజిటివ్‌గానే ఉన్నా మధ్యాహ్నం నుంచి ఆయిల్ అండ్ గ్యాస్ మినహా అన్ని రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. ఉదయం బ్యాంక్ నిఫ్టీ, మెటల్ సెక్టార్ అండతో సూచీలు ఓ మాదిరి లాభాల్లో ఉండగా, మధ్యాహ్నం సెషన్ నుంచి ఈ రెండు సెక్టార్ షేర్లలోనూ  సెల్లాఫ్ చోటు చేసుకుంది. దాదాపు నెల రోజుల నుంచి మంచి జోరు ప్రదర్శించిన ఫార్మా రంగ స్టాక్స్‌లోనూ భారీగా లాభాల స్వీకరణ చోటు చేసుకోవడం ఇవాళ్టి సెషన్‌లో క్లియర్‌గా కన్పించింది. చివరకు నిప్టీ 137 పాయింట్ల నష్టంతో 14496 పాయింట్ల వద్ద , సెన్సెక్స్ 465 పాయింట్ల నష్టంతో 48253 పాయింట్ల వద్ద ముగిశాయి.

 

ఐతే బజాజ్ ప్యాక్‌లోని బజాజ్ హెల్త్‌కేర్ ఫేవరపిరవిర్ ట్యాబ్లెట్లను  మార్కెట్లలోకి విక్రయాలు ఆరంభించినట్లు ప్రకటించడంతో ఈ స్టాక్ ఇంట్రాడేలో 20 శాతం వరకూ పరుగులు తీసింది. ఫేవిజాజ్ పేరుతో ఈ  ట్యాబ్లెట్లు మార్కెట్లలో అందుబాటులో ఉంటాయ్. దీంతో ఈ స్టాక్ ఓ దశలో  రూ.618 వరకూ ఎగసింది. ఇదే ఈ స్టాక్ 52వీక్స్ హై  ప్రైస్ కావడం విశేషం.

 

మంగళవారం మార్కెట్లలో ఆటో స్టాక్స్ కూడా భారీగానే నష్టపోయాయ్. వాటిలో మహీంద్రా అండ్ మహీంద్రా 2.03శాతం, అమరరాజా బ్యాటరీస్ 1.84శాతం, ఐషర్ మోటర్స్ 1.43శాతం, మారుతి 1.41శాతం, టాటా మోటర్స్ 1.19,బాష్క్1.09శాతం నష్టపోగా, ఎంఆర్ఎఫ్, టివిఎస్ మోటర్స్, అశోక్ లేలాండ్, హీరోమోటోకార్ప్, బజాజ్ ఆటో, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, మదర్సన్ సుమీ ఒకటి నుంచి అరశాతం వరకూ నష్టపోయాయ్


ప్రధానంగా మధ్యాహ్నం సెషన్‌లో మార్కెట్లను రిలయన్స్,  హెచ్‌డిఎఫ్‌సి,హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఇన్ఫోసిస్ బాగా నష్టపరిచాయ్. సూచీల నష్టాలకు రిలయన్స్ 74.60 పాయింట్ల మేర కాంట్రిబ్యూట్ చేయగా,  హెచ్‌డిఎఫ్‌సి 23.59,హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 33.97 పాయింట్లు,ఇన్ఫోసిస్ 33.54 పాయింట్లు నష్టపరిచాయ్.

 

నిఫ్టీ గెయినర్లలో ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్,బజాజ్ పైనాన్స్, బిపిసిఎల్, ఓఎన్‌జిసి, అదానీ పోర్ట్స్ రెండున్నర నుంచి ఒకశాతం వరకూ లాభపడ్డాయ్

 


నిఫ్టీ లూజర్లలో రిలయన్స్  టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, సిప్లా,దివీస్ ల్యాబ్స్, హిందాల్కో,డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 5 నుంచి 2.25శాతం నష్టపోయాయ్.
 


nifty sensex red lose bajaj healthcare reliance hdfc infosys tcl divis hindalco closing report

Expert's View


ఒక స్టాక్ మల్టీ బ్యాగర్ అవ్వటానికి 20 సంవత్సరాలు పడుతుందా ?

Trending