ఆరేళ్లలోనే బెస్ట్ ఎర్నింగ్స్.. మరి ఫ్యూచర్ సంగతేంటి?

2021-03-04 22:54:53 By Y Kalyani

img

ఆరేళ్లలోనే బెస్ట్ ఎర్నింగ్స్.. మరి ఫ్యూచర్ సంగతేంటి?
20 ఏళ్లలో ఇన్వెస్టర్లకు మార్కెట్ ఎంతిచ్చింది
ఇక ముందు పెడితే ఏంత లాభం వస్తుంది

బడ్జెట్ తర్వాత మార్కెట్లు అత్యుత్తమంగా రాణించాయి. అంతకుముందు కూడా ర్యాలీ ఇన్వెస్టర్లకు మంచి రిటర్న్స్ ఇచ్చాయి. 10 మరియు 15 ఏళ్లకు నిఫ్టీ CAGR యాన్యువల్ గ్రోత్ 11శాతంగా ఉంది. జీడీపీ నామినల్ గా ఉన్న సమయంలోనే ఇది. ముఖ్యంగా డిసెంబర్ తో ముగిసిన ఆర్థిక సంవత్సరం 2020-21లోని 3వ త్రైమాసికంలో మార్కెట్ ఆరేళ్ల తర్వాత అత్యుత్తమ ఎర్నింగ్స్ రిపోర్ట్ చేసింది. 2014 తర్వాత ఇదే.  ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ గ్రోత్ దాదాపు 32శాతంగా ఉంది. ఊహించిన దాని కంటే తక్కువగా కోవిడ్ కేసులు రావడం.. కంపెనీలు ఆదాయం కోవిడ్ పేరుతో కాస్ట్ కటింగ్ చేశాయి. దీంతో పాటు... నార్మల్ వాతావరణం ఉండటంతో డిమాండ్ పెరిగి కంపెనీల ఆదాయాలు పెరిగాయి. కార్పొరేట్ ఎర్నింగ్స్ కంపెనీలకు కలిసొచ్చాయి. ఇన్వెస్టర్లలో విశ్వాసం పెంచింది. 
మార్కెట్ మీడియం టు లాంగ్ టర్మ్ లో మంచి విశ్వాసం కల్పించింది. అయినప్పటికీ ఓ కన్నేసి ఉంచాలి.  పెరుగుతున్న కేసులు.. ఆయిల్ ధరలు, అమెరికా బాండ్ల ఆదాయంపై షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. అయితే లాంగ్ టర్మ్ మాత్రం అధ్బుతంగా ఉంటుందని అంటున్నారు నిపుణులు. 

అంచనాలకు మించి...
ఆర్థిక సంవత్సరం 2021లో అంచనాలను మించి స్టాక్స్ పెరిగే అవకాశం ఉంది. అటు ఈక్విటీ ఇండెక్స్ లు కూడా అంచనాలు దాటతాయని.. ఏస్ ఇన్వెస్టర్ రాకేష్ ఝన్ ఝన్ వాలా వంటి వాళ్లు ఇప్పటికే చెబుతున్నారు. సెక్టార్లు... లార్జ్, స్మాల్ సంబంధం లేకుండా మంచి ఫండమెంటల్ స్టాక్స్ రాణించే అవకాశం ఉంది. అయితే లార్జ్ క్యాప్ కాస్త అవుట్ పెర్మాఫామ్ చేసే అవకాశం ఉంది. టెక్నాలజీ, హెల్త్ కేర్ రంగాల్లో అవకాశాలు పుష్కళంగా ఉన్నాయంటున్నారు.

రిటైల్ ఇన్వెస్టర్లకు సలహా....
 స్థిరంగా, లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకుని మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే మంచి ప్రాఫిట్ వస్తుంది. అయితే పదేళ్ల నుంచి 20 ఏళ్లకు కూడా మీ ఆర్థిక అవసరాలకు అనుగుణంగా పొజిషన్ మెయింటెన్ చేయవచ్చు. 2030 నాటికి మార్కెట్ లక్షకు చేరుతుందని రాకేష్ ఝన్ ఝన్ వాలా చెప్పారు. నిఫ్టీ కూడా డబుల్ అవుతుందని అంచనా వేశారు. 
గతంలో అనుభవాలు చూస్తే మార్కెట్లో 20 ఏళ్లలో యావరేజ్ గా ఏడాదికి 15శాతం వరకూ గ్రోత్ చూపించింది. ఇన్ ఫ్లేషన్ సగటు 6శాతంగా ఉంది. 1999లో ఈక్విటీ మార్కెట్లో రూ.100 ఇన్వెస్ట్ చేస్తే 20 ఏళ్లలో అది రూ.1650 ప్రాఫిట్ ఇచ్చింది. ఇప్పుడు మనంచూస్తున్న కోవిడ్ సంక్షోభం చాలా చిన్నది.. ఈ 20 ఏళ్లలో 9 ఆఫ్ 11 ఎటాక్స్, యూరోజోన్ క్రైసిస్, గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్, బ్రెగ్జిట్ వంటివి చవిచూసింది. అయితే మంచి ఆదాయం ఇచ్చింది. చాలామంది ఇన్వెస్టర్లు సంక్షోభ సమయంలోనే ఇన్వెస్ట్ చేశారు. అంతేకాదు.. మెజార్టీ ఇన్వెస్టర్లు మార్కెట్లోనే ఉన్నారు..ఎవరూ బయటకు రాలేదు. ఎమోషన్స్, భయాలకు సంబంధం లేకుండా మార్కెట్లో ఉండి సంపద స్రుష్టించారు. కాబట్టి.. ఇప్పుడు కూడా మార్కెట్ పెరుగుతుంది.. ఇక ముందు పెరుగుతుంది.. కాబట్టి తాత్కాలికంగా వచ్చే కరెక్షన్స్ చూసి భయపడిపోకుండా మీ పొజిషన్ కాపాడుకోండి.. మీ లక్ష్యాలకు అనుగుణంగా నిపుణులు సలహాలతో ట్రేడ్ చేయండి..  

Expert's View


WHAT IS BITCOIN ? HOW TO INVEST IN CRYPTO CURRENCY ?

Trending