షార్ప్‌గా బౌన్స్ బ్యాక్ అయిన బుల్స్..!15700పైన క్లోజైన నిఫ్టీ..! ఇండెక్స్‌లో ఆటంతా బజాజ్ గ్రూప్‌దే!

2021-06-10 16:37:27 By Anveshi

img

స్టాక్ మార్కెట్లు గురువారం షార్ప్‌గా బౌన్స్ బ్యాక్ అవడంతో నిఫ్టీ 102 పాయింట్లు, సెన్సెక్స్ 359 పాయింట్లు లాభపడ్డాయ్. 
నిఫ్టీ 15737 పాయింట్ల వద్ద, సెన్సెక్స్ 52300 పాయింట్ల వద్ద ముగిశాయ్. 

 

మార్కెట్లలో బ్యాంక్ నిఫ్టీ, ఐటీ షేర్ల హవాకి స్మాల్ క్యాప్ ఇండెక్స్ ర్యాలీ బాగా సాయపడింది. ఒక్క ఆటో రంగ షేర్లు తప్ప మిగిలిన ప్రతి రంగంలోనూ కొనుగోళ్ల మద్దతు భారీగా లభించింది. ప్రత్యేకించి ఫైనాన్స్,ఎన్‌బిఎఫ్‌సి, రియాల్టీ స్టాక్స్ సపోర్ట్‌తో సూచీలు మంచి లాభాలను గడించాయి

 

మార్కెట్లలో పాజిటివ్ బజ్‌కి ఆసియా మార్కెట్ల సానుకూల ట్రేడింగ్‌తో పాటు దేశీయంగా ఎకానమీ తిరిగి తెరుచుకోవడం కూడా ప్రధానకారణాలుగా తెలుస్తోంది. దీంతో చాలామంది అనలిస్టులు నిఫ్టీకి బయ్ ఆన్ డిప్స్ స్ట్రాటజీ ఫాలో అవ్వాల్సిందిగా రికమండ్ చేస్తున్నారు

 

ఇక నిఫ్టీ టాప్ 5 గెయినర్లలోబజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎస్‌బిఐ,దివీస్ ల్యాబ్స్, ఇండస్ఇండ్ బ్యాంక్ 7.26శాతం నుంచి 2.07శాతం వరకూ లాభపడ్డాయ్. ముఖ్యంగా బజాజ్ ట్విన్ ప్యాక్ మార్కెట్లని దడదడలాడించాయనడంలో సందేహమే లేదు. బజాజ్ ఫైనాన్స్ ఏకంగా 8శాతం వరకూ పెరిగి, రూ.6115ధరకి ఎగసింది. ఇది ఈ స్టాక్‌కి సరికొత్త 52 వారాల గరిష్టం. దీంతో  ఒక్క రోజులోనే ఈ స్టాక్ 420 రూపాయలవరకూ పెరిగింది. చివరకు 7.26శాతం లాభంతో రూ.6086.40 వద్ద ముగిసింది. అలానే బజాజ్ ఫిన్‌సర్వ్ కూడా తన 52 వారాల గరిష్టాన్ని అధిగమించి కొత్త గరిష్టాన్ని సృష్టించింది. ఇంట్రాడేలో 7శాతం పెరిగి  రూ.12108ధరకి చేరింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి 3.76శాతం లాభంతో రూ.11993.10 వద్దకు చేరింది. 

 

అటు లూజర్లలో బజాజ్ గ్రూప్ సంస్థకే చెందిన బజాజ్ ఆటోనే 1.06శాతం నష్టంతో రూ.4179.90కి చేరి టాప్ లూజర్‌గా  నిలిచింది. మిగిలిన వాటిలో ఐటిసి బజాజ్ ఆటో, ఐషర్ మోటర్స్, యూపిఎల్, అదానీ పోర్ట్స్ 1.51శాతం నుంచి 0.69శాతం నష్టపోయాయ్.


bajaj finance finserve auto rally nse bse dalalstreet closing report june10 telugu

Expert's View


నేను వేసుకున్న కోటు రంగు , రానున్న రోజుల్లో మార్కెట్ల రంగు ఇదేనా ?

Trending