మార్కెట్లలో రేంజ్ బౌండ్ ట్రేడింగ్, మెరిసిన మెటల్స్, ఇండెక్స్‌ని పుష్ చేస్తోన్న టాటా ప్యాక్

2021-04-08 12:23:42 By Anveshi

img

ఆరంభం నుంచి లాభాల్లోనే ట్రేడవుతున్నా, నిఫ్టీ 15వేల పాయింట్ల మార్క్ అందుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తోంది. ఇవాళ్టి ట్రేడింగ్‌లో( మధ్యాహ్నం 12.10 వరకూ) నిఫ్టీ గరిష్టంగా 14958పాయింట్ల వరకూ వెళ్లగలిగింది. దీంతో 15వేల పాయింట్లకు దగ్గర్లో బలమైన రెసిస్టెన్స్ ఉన్నట్లు అర్ధమవుతోంది. సెన్సెక్స్ కూడా 50వేల పాయింట్లపైకి ఎగసి అంతలోనే తిరిగి కిందకు జారింది. ఇండెక్స్‌లను మెటల్, ఐటీ స్టాక్స్ పుష్ చేస్తుండగా, స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్‌లో బయింగ్ జోరందుకుంది

అదానీ గ్రూప్ మొత్తం మార్కెట్ కేపిటలైజేషన్ 100 బిలియన్ డాలర్ల మార్క్‌ని అందుకోవడం, ఈ సెషన్ హైలైట్ కాగా, యాక్టివ్ స్టాక్‌గా కూడా అదానీ పోర్ట్స్ కౌంటర్లో భారీగా వాల్యూమ్ నమోదవుతోంది. 


ఇక టాప్ గెయినర్స్ లిస్ట్‌లో జెఎస్‌డబ్ల్యూ స్టీల్ వరసగా ఆరోసెషన్ కూడా లాభపడింది. ఇవాళ్టి ట్రేడింగ్‌లో జెఎస్‌డబ్ల్యూ స్టీల్  6శాతం వరకూ పెరిగి రూ.594.20ని తాకింది. అలానే రెండో టాప్ గెయినర్‌గా టాటా స్టీల్ 4.42శాతం పెరిగి రూ.913.50ని తాకింది. తర్వాత టాటా మోటర్స్ 3.35శాతం, హిందాల్కో 3.21శాతం, టైటన్ కంపెనీ 2.83శాతం పెరిగాయ్. మొత్తంగా చూస్తే ఇవాళ నిఫ్టీ ఇండెక్స్‌ని టాటా స్టాక్స్ లీడ్ చేస్తున్నాయని చెప్పాలి

అలానే ఇంట్రస్టింగ్‌గా నిఫ్టీ లూజర్లలో బజాజ్ ప్యాక్ చేరాయ్ ఎస్‌బిఐలైఫ్ ఇన్సూరె్స్ 0.73శాతం నష్టపోగా, బజాజ్ ఆటో 0.45శాకం. బజాజ్ ఫైనాన్స్ 0.36శాతం, ఆ తర్వాత హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, రిలయన్స్ నామమాత్రంగా నష్టపోయాయ్. 

Expert's View


WHAT IS BITCOIN ? HOW TO INVEST IN CRYPTO CURRENCY ?

Trending