ఎకానమీ అదరగొడుతోంది... పన్నులు వసూళ్లు సూపర్

2021-09-24 22:39:54 By Y Kalyani

img

ఎకానమీ అదరగొడుతోంది... పన్నులు వసూళ్లు సూపర్

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం FY21-22లో అర్థ సంవత్సరం పూర్తి అయింది. 6 నెలల సమయానికి రికార్డు స్థాయిలో పన్నులు వసూళ్లు అయ్యాయి. గ్రాస్ డైరెక్ట్ ట్యాక్స్ ఏకంగా 47 శాతం పెరిగింది. నికర పన్ను వసూళ్లు 74 శాతం పెరిగాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.  2021-22 ఫైనాన్షియల్ ఇయర్లో అంటే ప్రస్తుతం సెప్టెంబర్ 22 నాటికి నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ .5.71 లక్షల కోట్లు దాటయి. గత ఏడాది 2020-21లో ఇదే కాలానికి రూ. 3.27 లక్షల కోట్ల కంటే 74 శాతం పెరిగింది. 2019-20లో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ .4.49 లక్షల కోట్లు. గత ఏడాది మొత్తంతో చూసినా ఈ సంవత్సరం ఏప్రిల్ 1-సెప్టెంబర్ 22 మధ్య 27 శాతం అధికంగా ఉంది. 

2020-21 ఏప్రిల్-జూన్‌లో దేశవ్యాప్త లాక్డౌన్ ఉంది. దాదాపు అన్ని ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. సెకండ్ వేవ్ COVID కేసులు మరియు మరణాలను చూసినప్పటికీ, కేంద్ర, రాష్ట్ర మరియు స్థానికంగా కంటైన్మెంట్ జోన్‌లను మరింత మెరుగైన రీతిలో వ్యవహరించడంతో ఆర్థిక కార్యకలాపాలు కొనసాగాయి. పన్నుల వసూళ్లు పెరిగాయి. 2021-22 ఆర్థిక సంవత్సరం ప్రారంభ నెలలు చాలా సవాలుగా ఉన్నప్పటికీ, రెండవ త్రైమాసికంలో ముందస్తు పన్ను వసూలు (జూలై 1, 2021, సెప్టెంబర్ 22, 2021 వరకు) 2020-21 ఆర్థిక సంవత్సరంలో 51.5 శాతం వృద్ధిని సాధించినట్టు మంత్రిత్వ శాఖ చెప్పింది. గత సంవత్సరం ఇదే కాలానికి ముందస్తు పన్ను వసూళ్లు రూ .1.62 లక్షల కోట్లుగా ఉన్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ .75,111 కోట్ల రీఫండ్‌లు కూడా జారీ చేయబడ్డాయి.


gross tax latest

Expert's View


ఇన్వెస్టర్లకు ఎనలిస్టుల "దసరా మాములు" స్టాక్ రెకమెండేషన్స్

Trending