హైదరాబాదీ ఫార్మా కంపెనీ దూకుడు.. అదిరిపోయే ప్లాన్స్

2021-06-20 11:57:34 By Y Kalyani

img

హైదరాబాదీ ఫార్మా కంపెనీ దూకుడు.. అదిరిపోయే ప్లాన్స్

దేశవ్యాప్తంగా ఫార్మా కంపెనీలు లాభాలు భారీగా ఉన్నా.. నాట్కో కాస్త వెనకబడింది. అయితే కోవిడ్ సంబంధించి వ్యాపారంలో కంపెనీ లేకపోవడంతో ఆర్ధిక ఫలితాలు కాస్త నిరుత్సాహపరచడం నిజమే. అయితే కొవిడ్‌ కారణంగా అమ్మకాలపై ఒత్తిడి ఉన్నప్పటికీ.. ప్రస్తుతం ఆర్ధిక సంవత్సరంలో అదిరిపోయే సేల్స్ ఉంటాయంటోంది హైదరాబాద్ ఫార్మా దిగ్గజం నాట్కో. 2021-22లో కొత్తగా ఇండియన్ మార్కెట్లో డజనుకు పైగా ఉత్పత్తులు విడుదల చేస్తుందట. అగ్రోకెమికల్స్‌ విభాగంలో ఆదాయాన్ని పెంచుతుందని అంచనా. 
అమెరికా మార్కెట్లోకి కొత్తగా డ్రగ్స్ విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది నాట్కో. ఎవిరోలిమస్‌ వంటి తక్కువ పోటీ ఉన్నవి కూడా ఉన్నాయి. కంపెనీ వ్యూహానికి, వృద్ధికి అనుకూలంగా ఉండే కంపెనీలు, ఔషధాలను కొనుగోలు చేయడంపై కూడా నాట్కో దృష్టి పెట్టింది. దేశీయ మార్కెట్లో కేన్సర్‌ ఔషధాల విభాగంలో నాట్కో అగ్రగామిగా ఉంది. ఈ విభాగంలో దాదాపు 33 డ్రగ్స్ విక్రయిస్తోంది. హార్ట్, షుగర్ విభాగాల్లో లేటస్టుగా డ్రగ్స్ తీసుకొచ్చేందుకు కంపెనీ ప్రయత్నాల్లో ఉంది. 


pharma small cap market trading profit