నిఫ్టీ వెంటే MRF స్టాక్ రైజింగ్..! సింగిల్ డే ప్రాఫిట్ రూ.1000పైనే

2021-02-23 14:01:20 By Anveshi

img

బాహుబలి స్టాక్ ఎంఆర్ఎఫ్ నిఫ్టీతో పాటే లేస్తోంది.  మధ్యాహ్నం లంచ్ సమయానికి ఈ స్టాక్ ధర రూ.87,672.85 వద్ద ట్రేడ్ అయింది ఇంట్రాడేలో దాదాపు 1శాతానికిపైగా లాభపడి రూ.87978.90 పైసలను తాకగా..రోజు ట్రేడింగ్‌లో రూ.85858.80పైసలకు కూడా ఓ దశలో నేలచూపులు చూసింది

రిటన్ ఆన్ ఈక్విటీ 11.64శాతం కాగా, మద్యాహ్నం 1.34 నిమిషాలకు ఈ కౌంటర్‌లో రూ.12.82కోట్ల మేర లావాదేవీల
టర్నోవర్ నమోదు అయింది. ఎంఆర్ఎఫ్ సంస్థ షేర్ల 52 వారాల గరిష్ట ధర రూ.98,575.90..ఇదే ఫిఫ్టీ టూ వీక్స్ లో లెవల్ చూస్తే రూ.50వేలు. ఈ స్టాక్ గురించే ఎందుకు చెప్పాలంటే , ఎంఆర్ఎఫ్ షేరు బీటా వేల్యూ 0.81 కాబట్టి..హై బీటా వేల్యూ..లో బీటా వేల్యూ  ఉన్న స్టాక్స్‌కి నిఫ్టీ ట్రేడింగ్‌తో ఎక్కువగా కానీ తక్కువగానీ సంబంధం ఉంటుంది. 

ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏమిటంటే, గత 16ఏళ్ల ట్రేడింగ్‌లో ఎంఆర్ఎఫ్ స్టాక్ ఎప్పుడూ కేవలం 1.8శాతం మాత్రమే ఇంట్రాడేలో 5శాతం కంటే తక్కువగా ఈ షేరు పతనమైంది. గత సెషన్‌లో రూ.86,921.30 వద్ద ట్రేడింగ్ క్లోజ్ అయిన ఎంఆర్ఎప్ ప్రస్తుతం( కథనం ప్రచురించే సమయానికి) రూ.87,654 వద్ద ట్రేడ్ అయింది

Expert's View


MTAR Technologies కాసుల వర్షం కురిపిస్తుందా?

Trending