తెలంగాణ ఖాతాలో మరో భారీ పెట్టుబడి.. 15వేల కోట్లతో మైక్రోసాఫ్ట్

2021-07-21 23:15:10 By Y Kalyani

img

తెలంగాణ ఖాతాలో మరో భారీ పెట్టుబడి.. 15వేల కోట్లతో మైక్రోసాఫ్ట్

పెట్టుబడుల స్వర్గాధామంగా మారిన హైదరాబాద్ కు కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఐటీ, ఫార్మా, వ్యాక్సిన్, డిఫెన్స్, ఆటో రంగాలకు చిరునామాగా మారిన భాగ్యనగరంలో కొత్త కొత్త సంస్థలు.. అతిపెద్ద సంస్థలు భారీగా పెట్టుబడులతో వస్తున్నాయి. లేటెస్టుగా మరో బ్రేకింగ్ అందుతోంది. ఇప్పటికే అమెరికా తర్వాత అతిపెద్ద కార్యాలయం కలిగి ఉన్నఅమెరికా ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ డేటా సెంటర్‌ను కూడా ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. ఇందులో భాగంగా రూ.15 వేల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు ఫైనల్ స్టేజిలో ఉన్నాయి. దీనికి సంబంధించిన వార్తలు జాతీయ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. త్వరలోనే త్వరలో మైక్రోసాఫ్ట్‌ అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉందట. ఈ డేటా సెంటర్‌ కోసం స్థలాన్ని కూడా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. 
అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌, గూగుల్‌ సైతం భారత్‌లో డేటా సెంటర్ల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నాయి. 2024 కల్లా భారత్‌లో డేటా సెంటర్ల ఆదాయం నాలుగు బిలియన్‌ డాలర్లకు చేరుకోనున్నట్లు ప్రాక్సిస్‌ గ్లోబల్‌ అలయన్స్‌ నివేదిక ఇటీవల అంచనా వేసింది. మైక్రోసాఫ్ట్ కంపెనీ ఇక్కడకు వస్తే.. మిగిలిన సంస్థలు కూడా హైదరాబాద్ వచ్చే ఛాన్స్ ఉంది. మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కంపెనీలకు అనుకూలంగా మారాయి. 


microsoft telangana data centre news