దలాల్ స్ట్రీట్‌లో ఇవాళ ట్రేడింగ్ బేరిష్‌గా కొనసాగుతోంది. ఉదయం నుంచీ నెగటివ్‌గానే సాగిన ట్రేడింగ్ గంటగంటకీ నష్టాలను ఎక్కువ చేసిందే తప్ప కోలుకుంది లేదు. ఐటీ స్టాక్స్ హెవీ బ్లీడింగ్ కన్పించగా, బ్యాంక్ నిఫ్టీ బాగా నష్టపోయింది. ఐతే కొన్ని రంగాల షేర్లు మాత్రం బాగా షైనయ్యాయ్.
వాటిలో మెటల్ షేర్లలో మంచి బయింగ్ సపోర్ట్ కన్పించింది వాటిలో హింద్ కాపర్ ఏకంగా 15శాతం వరకూ లాభపడింది. రత్నమణి మెటల్స్ 10శాతం లాభపడి రూ.1873 వద్ద ట్రేడ్ అయింది. కింది ఫోటోలో స్టీల్ సంబంధిత రంగాల షేర్ల పెర్ఫామెన్స్ చూడవచ్చు.
ఇవే కాకుండా జింక్, కాపర్ అల్లాయ్స్ రంగంలో ఉన్న ఇతర షేర్లూ బాగా ర్యాలీ చేశాయ్. భాగ్యనగర్ ఇండస్ట్రీస్ 6శాతానికిపైగా, క్యూబెక్స్ ట్యూబ్స్ 2.4శాతం లాభపడ్డాయ్.