హైదరాబాద్ MEIL కంపెనీకి మెగా ప్రాజెక్టులు

2022-01-14 22:04:39 By Y Kalyani

img

హైదరాబాద్ MEIL కంపెనీకి మెగా ప్రాజెక్టులు

15 నగరాల్లో గ్యాస్ సరఫరా ఒప్పందాలు 

తెలంగాణలోని హైదరాబాద్ కు చెందిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ MEIL తొమ్మిది రాష్ట్రాలలో 15 సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ CGD ప్రాజెక్ట్‌లను కైవసం చేసుకుంది. శుక్రవారం తెరిచిన బిడ్లలో తమకు అవార్డ్ అయినట్టు కంపెనీ ప్రకటించింది. పెట్రోలియం మరియు సహజ వాయువు నియంత్రణ మండలి PNGRB  మొత్తం దేశంలోని 65 ప్రాంతాలకు CGD ప్రాజెక్ట్‌లో భాగంగా 11వ రౌండ్ బిడ్డింగ్‌కు కంపెనీలను ఆహ్వానించింది. MEIL 43 GAల కోసం బిడ్ చేసింది. MEIL 15 గెలుచుకుంది. కర్ణాటక, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్‌, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌లలో ప్రాజెక్టులు కంపెనీ చేతికి చిక్కాయి. 
ఆర్థిక వివరాలను ముఖ్యంగా ప్రాజెక్టు వ్యయం వంటి వాటిని కంపెనీ తెలియజేయలేదు. సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (CGD) ప్రాజెక్ట్ కింద సిఎన్‌జి స్టేషన్‌లను ఇన్‌స్టాల్ చేయడంతో పాటుగా సిటీ గేట్ స్టేషన్‌లు లేదా మదర్ స్టేషన్‌లను నిర్మించడం, ప్రధాన పైప్‌లైన్ మరియు డిస్ట్రిబ్యూషన్ పైప్‌లైన్‌లు వేయడం పనులు ఇందులో భాగంగా ఉంటాయి. గృహాలు మరియు పరిశ్రమలకు పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) మరియు వాహనాలు మరియు ఆటోమొబైల్ పరిశ్రమకు ఇంధనంగా ఉపయోగించే కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) ప్రోత్సహించడం CGD ప్రాజెక్టు లక్ష్యం. CGD ప్రాజెక్ట్‌ల కోసం 10వ రౌండ్ బిడ్డింగ్‌లో, MEIL కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో 3 చోట్ల పనులు చేపడుతుంది. హైదరాబాద్‌కు చెందిన MEIL భారతదేశంలోని ప్రధాన మౌలిక సదుపాయాల కంపెనీలలో ఒకటి, దాదాపు 10 దేశాలలో ఉనికిని కలిగి ఉంది.


meil gasm CGD projects latest news