మారుతీ స్టాక్ రేటింగ్ ఎందుకు తగ్గించినట్టో

2021-12-04 09:46:22 By Y Kalyani

img

మారుతీ స్టాక్ రేటింగ్ ఎందుకు తగ్గించినట్టో
అమ్మకాల్లో టాటా మోటర్స్ నుంచి పోటీ
SUV విభాగంలో పోటీ ఇవ్వలేకపోతుందా

CLSA మారుతీ సుజుకి ఇండియాపై తన రేటింగ్‌ను తగ్గించింది అండర్ పెర్‌ఫార్మ్ సెల్ ఆఫ్షన్ ఇచ్చింది బ్రోకరేజి సంస్థ. వాస్తవానికి వాహన తయారీదారు మారుతీ ఇండియాలో అత్యతంగా వేగంగా  అభివృద్ధి చెందుతున్న స్పోర్ట్స్ వెహికిల్ విభాగంలో మార్కెట్ వాటాను కోల్పోతున్నందున టార్గెట్ ధరను రూ. 6,550 నుండి రూ. 6,420కి తగ్గించింది. యుటిలిటీ వెహికల్ సెగ్మెంట్ లో మారుతీ సేల్స్ తగ్గిపోతున్నాయి. వాస్తవానికి ఈ విభాగంలో పోటీ భారీగా ఉంది. కియా, ఎంజీ వంటి కంపెనీలు వచ్చాయి. హుండాయ్, స్కోడా, వొక్స్ వ్యాగన్, నిసాన్, రెనో కంపెనీలు వేల కోట్ల పెట్టుబడులతో ఈ విభాగంలో అడుగుపెడుతున్నాయి. కొత్త కొత్త మోడల్స్ తీసుకొస్తున్నాయి. అటు టాటా కూడా ఈ విభాగంలో మారుతీకి గట్టి పోటీ ఇస్తోంది. SUV సెగ్మెంట్ ప్యాసింజర్ వాహనాల వాటా గణనీయంగా పెరగడం మరియు ఈ విభాగంలో మారుతి మార్కెట్ వాటాను కోల్పోవడం వల్ల దేశీయ ప్యాసింజర్ వాహన పరిశ్రమలో FY20- 22 కాలంలో కంపెనీ 600 bps (బేసిస్ పాయింట్లు) మార్కెట్ వాటాను కోల్పోయే అవకాశం ఉందని CLSA ఒక నోట్‌లో పేర్కొంది.
కొత్త మోడల్ లాంచ్ పై మారుతి పెద్దగా ప్రణాళికలు కనిపించడం లేదు. నవంబరులో మారుతీ అమ్మకాలు తగ్గగా.. టాటా వాహనాల సేల్స్ పెరిగాయి. ఇందుకు నెక్సాన్, పంచ్ వంటి SUV మోడల్స్ కారణం. ఏకంగా 38శాతం అమ్మకాలు పెరిగాయి. 
దేశీయ ప్యాసింజర్ వాహన పరిశ్రమలో SUV సెగ్మెంట్ వాటా FY20లో 32శాతం నుండి అక్టోబర్ వరకు FY22లో 39శాతానికి పెరిగింది. అయితే మారుతి మార్కెట్ వాటా ఈ విభాగంలో 560 బేసిస్ పాయింట్లు క్షీణించింది. మారుతి నవంబర్‌లో 1.4 లక్షల యూనిట్ల మొత్తం విక్రయాలలో సంవత్సరానికి 9.2శాతం తక్కువ నమోదు చేసింది.


clsa markets trading maruti stocks