స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లోనే ముగిసినా, ఓ రకమైన ఊగిసలాట ధోరణి మాత్రం క్లియర్‌గా కన్పించింది.నిఫ్టీ 15వేల పాయింట్ల మార్క్ ఇవాళ కూడా అందుకోలేకపోయింది. దానికి తోడు మధ్యలో వచ్చిన 14950 పాయింట్ల మార్క్ కూడా కోల్పోయి చివరికి దాదాపు 55పాయింట్ల లాభంతో 14873 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు సెన్సెక్స్ కూడా 400 పాయింట్ల లాభం కాస్తా కోసుకుని చివరికి 84 పాయింట్ల లాభంతో 49746 పాయింట్ల వద్ద ముగిసింది
స్టాక్ మార్కెట్లలో గురువారం చివరిలో లాభాలు తగ్గిపోవడానికి ప్రధాన కారణం ఫైనాన్షియల్ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి అలానే నిఫ్టీ బ్యాంక్ కూడా 300 పాయింట్ల లాభం నుంచి 200 పాయింట్లు నష్టపోయింది. అంటే ఈ ఒక్క సెక్టార్లోనే 500 పాయింట్లకిపైగా స్వింగ్ కన్పించింది. మెటల్స్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ స్టాక్స్ హెవీగా లాభపడగా, ఐటీ స్టాక్స్‌లో ర్యాలీ కొనసాగుతోంది.
ప్రధానంగా గెయినర్లను చూసినప్పుడు ఉదయం నుంచి దూకుడు ప్రదర్శించిన మెటల్ ఇండెక్స్‌లోని జెఎస్డబ్ల్యూ స్టీల్,టాటా స్టీల్ తమ డామినేషన్‌ని ఇవాళ కూడా ప్రదర్శించాయ్. జెఎస్డబ్ల్యూ స్టీల్ 9.59శాతం లాభపడగా, టాటా స్టీల్ 5.39శాతం లాభపడింది. అలానే సిమెంట్ రంగ షేర్లు కూడా ఇవాళ భారీగా లాభపడటంతో శ్రీసిమెంట్స్ మరోసారి దాదాపు రూ.1500 లాభపడింది 4.79శాతం పెరిగి శ్రీ సిమెంట్స్ 31,680 రూపాయల వద్ద ట్రేడ్ ముగియగా, అల్ట్రాటెక్ సిమెంట్ 4.14శాతం లాభపడి 7040 వద్ద ముగిసింది మరో మెటల్ స్టాక్ హిందాల్కో 4.05శాతం లాభపడింది
లూజర్ల విషయానికి వస్తే, మిక్స్డ్ స్టాక్స్ కన్పిస్తాయ్, సన్ ఫార్మా 1.14శాతం నష్టపోగా,ఇండస్ఇండ్ బ్యాంక్ 1.12శాతం, ఓఎన్జిసి 1శాతం,ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్, బజాజ్ ఫైనాన్స్ చెరో ఒక్క శాతం నష్టపోయాయ్.
మార్కెట్లలో ఇవాళ్టి ట్రేడింగ్ ట్రెండ్ గమనించినప్పుడు, ఇన్వెస్టర్లను లాక్డౌన్ టెన్షన్ వెంటాడుతున్నట్లు అర్ధమవుతోంది. ఎందుకంటే దేశంలో ఒక్కో రాష్ట్రం పాక్షికంగా లాక్డౌన్ విధిస్తున్నాయ్. కింద లిస్ట్ చూస్తే, పరిస్థితి ఎలా తయారైందీ మీకు అర్ధమవుతుంది
మళ్లీ తెరపైకి లాక్డౌన్ టెన్షన్
మధ్యప్రదేశ్- అన్ని నగరాల్లో 60 గంటల లాక్డౌన్,5రోజుల పనిదినాలు, వీకెండ్ లాక్డౌన్, చింద్వారాలో 7 రోజులు లాక్డౌన్
మహారాష్ట్ర- నైట్ కర్ఫ్యూ డాన్ టు డెస్క్, నెలంతా వీకెండ్ లాక్డౌన్ (సినిమాలు, మల్టీప్లెక్స్,స్పాలు అన్నీ షట్‌డౌన్)
పంజాబ్ -నైట్ కర్ఫ్యూ రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 వరకూ( పబ్లిక్ గేదరింగ్స్ 0-100మంది వరకే)
ఢిల్లీ-నైట్ కర్ఫ్యూ ( రాత్రి 10 నుంచి ఉదయం 5 వరకూ)
ఉత్తరప్రదేశ్-లక్నోలో నైట్ కర్ఫ్యూ,స్కూళ్లూ,కాలేజీలు బంద్
గుజరాత్-20 నగరాల్లో నైట్ కర్ఫ్యూ
ఒడిశా-10 జిల్లాల్లో నైట్ కర్ఫ్యూ
రాజస్థాన్-ఏప్రిల్ 19 వరకూ నైట్ కర్ఫ్యూ
చండీఘడ్-సిటీలో నైట్ కర్ఫ్యూ
చత్తీస్ఘడ్-రాయ్‌పూర్ జిల్లా అంతటా లాక్డౌన్ ఏప్రిల్ 9-19 వరకూ