మార్కెట్ 9శాతం మటాష్
మళ్లీ ఎలా కోలుకుంటుందో ఏంటో
స్టాక్ మార్కెట్ పతనం కొనసాగుతోంది. బేర్ తన పట్టు బిగింది.. ఇన్వెస్టర్లపై చీల్చి చెండాడుతోంది. ఫర్వాలేదు అనుకున్న ప్రతిసారీ మరింత పతనం అవుతూ పెట్టుబడిదారులకు రక్తకన్నీరు మిగిల్చుతోంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అంచనాల అందుకోని కార్పొరేట్ ఆదాయాలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం ఇన్వెస్టర్ల సంపద ఆవిరి చేస్తూనే ఉన్నాయి.
లక్షల కోట్ల సంపద ఆవిరి
సెన్సెక్స్ 1,158 పాయింట్లు పతనమై 52,930 వద్ద, నిఫ్టీ 359 పాయింట్లు జారి 15,808 వద్ద ఈరోజు సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా ఐదో సెషన్లోనూ పతనమయ్యాయి. దీంతో పెట్టుబడిదారులు గురువారం రూ. 5 లక్షల కోట్లకు పైగా నష్టపోయారు. గత సెషన్లో పెట్టుబడిదారుల సంపద రూ.246.31 లక్షల కోట్ల నుంచి రూ.241.10 లక్షల కోట్లకు క్షీణించింది. అంటే బీఎస్ఈ-లిస్టెడ్ సంస్థల మార్కెట్ క్యాప్ రూ.5.25 లక్షల కోట్లు తగ్గింది.
ఢమాల్ మార్కెట్...
సెన్సెక్స్ ఇయర్ టు డేట్ చూస్తే ఏకంగా 9.14 శాతం పడిపోయింది. అంటే 5323 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 8.91 శాతం అంటే 1546 పాయింట్లు కోల్పోయింది.
గురువారం టాప్ లూజర్స్ ఇవే...
ఇండస్ఇండ్ బ్యాంక్:
స్టాక్ 5.82% పడిపోయి రూ. 869.45కి చేరుకుంది. బిఎస్ఇలో క్రితం ముగింపు రూ.923.30తో పోలిస్తే ఈ షేరు రూ.915 వద్ద ప్రారంభమైంది.
టాటా స్టీల్:
బిఎస్ఇలో షేరు 4.13 శాతం నష్టంతో రూ.1118.15 వద్ద ముగిసింది. లార్జ్ క్యాప్ స్టాక్ గత ముగింపు రూ.1166.30తో పోలిస్తే రూ.1157 వద్ద దిగువన ప్రారంభమైంది.
బజాజ్ ఫైనాన్స్:
క్రితం ముగింపు రూ.5806తో పోలిస్తే ఈ షేరు 3.76 శాతం పతనమై రూ.5588కి చేరుకుంది.బీఎస్ఈలో ఈ షేరు రూ.5764 వద్ద ప్రారంభమైంది.
బజాజ్ ఫిన్సర్వ్:
బిఎస్ఇలో క్రితం ముగింపు రూ.13318తో పోలిస్తే షేరు 3.53 శాతం పడిపోయి రూ.12,848.95కి చేరుకుంది. బీఎస్ఈలో బ్యాంకింగ్ స్టాక్ రూ.1,31,90 వద్ద దిగువన ప్రారంభమైంది.
యాక్సిస్ బ్యాంక్:
ప్రైవేట్ రుణదాత షేర్లు బిఎస్ఇలో 3.44 శాతం నష్టంతో రూ.649.35 వద్ద ముగిసింది. లార్జ్ క్యాప్ స్టాక్ గత ముగింపు రూ.672.45తో పోలిస్తే రూ.669 వద్ద దిగువకు ప్రారంభమైంది.