వరుసగా ఐదోరోజూ దేశీయ మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. దేశీయ సూచీలు నెల రోజుల కనిష్టానికి పడిపోయాయి. ఇవాళ ఉదయం సెన్సెక్స్ 1.2శాతం నష్టంతో 46,834 వద్ద, నిఫ్టీ 1.1శాతం నష్టంతో 13,810 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 310 పాయింట్ల నష్టంతో 47099 వద్ద, నిఫ్టీ 96 పాయింట్ల నష్టంతో 13872 వద్ద ట్రేడవుతోన్నాయి. సెన్సెక్స్ ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి నుంచి 3వేల పాయింట్లు, నిఫ్టీ 1000 పాయింట్లు నష్టపోయాయి.
ఇవాళ క్యాపిటల్ గూడ్స్, ఆయిల్ అండ్ గ్యాస్ కౌంటర్లు మినహా అన్ని రంగాల కౌంటర్లు నష్టాల్లో కొనసాగుతోన్నాయి. బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడేలో 30వేల దిగువకు పడిపోయింది. పీఎస్‌యూ బ్యాంక్, మెటల్, ఆటో, ఫార్మా ఇండెక్స్‌లు దాదాపు ఒకటిన్నర శాతం నష్టంతో ఉన్నాయి. ఎన్ఎస్ఈలో 1238 స్టాక్స్ నష్టాల్లో 373 స్టాక్స్ లాభాల్లో కదలాడుతోన్నాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీలు మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌గా ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్ 1.66శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ 1శాతం, బీపీసీఎల్ 0.88శాతం, హీరోమోటోకార్ప్ 0.43శాతం, భారతీ ఎయిర్టెల్ 0.41శాతం లాభంతో నిఫ్టీ టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. టెక్ మహీంద్రా 2.62శాతం, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ 2.29శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2.28శాతం, సన్‌ఫార్మా 2.02శాతం, కోటక్ మహీంద్రా 2.06శాతం నష్టంతో నిఫ్టీ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి.