-->

ఈ వారం మార్కెట్ కీ ఫ్యాక్టర్స్

2021-01-11 07:39:37

img

ఈ వారం మార్కెట్ కీ ఫ్యాక్టర్స్

కొత్త ఏడాదిలో కూడా వరుసగగా స్టాక్ మార్కెట్లు రెండు వారాలు దూకుడుగా ఉన్నాయి. రికార్డు స్థాయిలో క్లోజ్ అయ్యాయి. జనవరి 8 వరకు BSE స్టాక్ మార్కెట్    913 పాయింట్లు లాఢపడి 48,781 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ కూడా 328 పాయింట్లు బలపడి 14,347 పాయింట్ల గరిష్ట స్థాయి వద్ద క్లోజ్ అయింది. మిడ్ క్యాప్ 100 సూచీలు 5.2శాతం గెయిన్ కాగా.. స్మాల్ క్యాప్100 ఇండెక్స్ కూడా 3.8శాతం పెరిగింది. 
సానుకూలంగా పరిస్థితులు..
ఈ వారం కూడా మార్కెట్ కు సానుకూలంగా కనిపిస్తుంది. వ్యాక్సిన్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. అటు ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే యూనియన్ బడ్జెట్ పైనా అంచనాలున్నాయి. 
త్రైమాసిక ఫలితాలు...
ముఖ్యంగా ఈ వారం మార్కెట్లు కంపెనీల త్రైమాసిక పలితాలపై ఫోకస్ పెట్టారు ఇన్వెస్టర్లు. బ్యాంకింగ్, ఆటో సెక్టార్లు కీలకంగా మారాయి. ముందుగా వచ్చే TCS ఫలితాలు ఐటీ ఇండెక్స్ కు ఈ వారమంతా నడిపిస్తాయి. దీని TCS తర్వాత విప్రో, HCL కూడా లైన్లో ఉన్నాయి. 
ఇక ఇన్ ఫ్లేషన్, ఇండస్ట్రీయల్ ప్రొడక్షన్ డేటా కూడా మార్కెట్ ను ప్రభావితం చేస్తాయి.