ఆకాశాన్నంటిన మహారాష్ట్ర సీమ్‌లెస్ షేర్లు.. 10% పెరిగి రెండేళ్ల గరిష్టానికి స్టాక్

2021-10-13 12:29:14 By VANI

img

మహారాష్ట్ర సీమ్‌లెస్ షేర్లు నేడు ఆకాశాన్నంటాయి. కంపెనీ షేర్లు బుధవారం ఇంట్రా డే ట్రేడ్‌లో 10 శాతం పెరిగి రెండు సంవత్సరాల గరిష్ట స్థాయి రూ.47ను తాకాయి. నేటి లాభంతో అక్టోబర్ మొదటి తొమ్మిది ట్రేడింగ్ రోజులలో స్క్రిప్ 50 శాతం పెరిగింది. ఇనుము అండ్ ఉక్కు ఉత్పత్తుల కంపెనీ మే 2019 నుంచి అత్యధిక స్థాయిలో కోట్ చేయబడింది. 

 

అక్టోబర్ 8, 2021న, సీమ్‌లెస్ కేసింగ్ పైపుల సరఫరా కోసం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC) నుంచి రూ.237 కోట్ల విలువైన ఆర్డర్‌ను కంపెనీ విజయవంతంగా పొందినట్లు మహారాష్ట్ర సీమ్‌లెస్ ప్రకటించింది. కంపెనీ ప్రధానంగా ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్‌లోని కంపెనీలకు సేవలు అందిస్తోంది. ఇక్కడ ఇది ప్రముఖ దేశీయ చమురు ఉత్పత్తిదారులు, రిఫైనర్‌లకు రిజిస్టర్డ్ విక్రేత. 

 

అదనంగా, ఇది పవర్ ప్లాంట్లు, బాయిలర్లు, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ మొదలైన ఇతర విభాగాలను కూడా అందిస్తుంది. అప్‌స్ట్రీమ్ ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్ కోసం ఎక్స్‌ప్లొరేషన్, ప్రొడక్షన్‌లో ఇన్‌వాల్వ్ అయ్యింది. కంపెనీకి 30 శాతం అప్‌స్ట్రీమ్ ఎక్స్‌పోజర్, 70 శాతం డౌన్‌ స్ట్రీమ్ ఎక్స్‌పోజర్ మధ్యన ఉన్నాయి. అదనంగా ఇండస్ట్రీ మిక్స్‌లో 50 శాతం చమురు, గ్యాస్ నుంచి వస్తోంది. కొత్త ఉత్పత్తులపై కంపెనీ దృష్టి పెట్టడం మార్కెట్ వాటాను మెరుగుపరచడంలో సహాయపడుతుందని మహారాష్ట్ర సీమ్‌లెస్ తన 2021 ఆర్థిక సంవత్సరం వార్షిక నివేదికలో పేర్కొంది.


 


Maharastra Seamless  ONGC  

Expert's View


ఇన్వెస్టర్లకు ఎనలిస్టుల "దసరా మాములు" స్టాక్ రెకమెండేషన్స్

Trending