ఆల్ టైం గరిష్టానికి చేరిన మార్కెట్ క్యాప్

2021-10-13 21:58:37 By Y Kalyani

img

ఆల్ టైం గరిష్టానికి చేరిన మార్కెట్ క్యాప్

ఈక్విటీలలో కొనసాగుతున్న ర్యాలీతో బిఎస్‌ఇ-లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ బుధవారం సరికొత్త రికార్డు స్థాయికి చేరింది. రూ .270 లక్షల 73వేల 296.03 కోట్లకు చేరుకుంది. బుధవారం వరుసగా ఐదో రోజు కూడా ర్యాలీ చేయడంతో BSE30-షేర్ల బెంచ్‌మార్క్ 452.74 పాయింట్లు అంటే 0.75 శాతం ఎగబాకి ఆల్-టైమ్ గరిష్ట స్థాయి 60,737.05 వద్ద స్థిరపడింది. ఐదు ట్రేడింగ్ సెషన్లలో బిఎస్‌ఇ బెంచ్‌మార్క్ ఇండెక్స్ 1,547.32 పాయింట్లు పెరిగింది.
కొనసాగుతున్న ర్యాలీతో పాటు పెట్టుబడిదారుల సంపద కూడా భారీగా పెరిగింది. కేవలం 5 రోజుల్లో రూ .8,52,748.98 కోట్లు పెరిగింది. M&M అత్యధికంగా లాభపడింది. ITC, పవర్‌గ్రిడ్, టెక్ మహీంద్రా మరియు లార్సెన్ & టూబ్రో షేర్లు లాభాల్లో పయనించాయి. మిడ్‌క్యాప్ మరియు స్మాల్‌క్యాప్ సూచీలు 1.56 శాతం వరకు పెరిగాయి. 


market cap mcap latest news

Expert's View


ఇన్వెస్టర్లకు ఎనలిస్టుల "దసరా మాములు" స్టాక్ రెకమెండేషన్స్

Trending