ఐపీఓ కోసం మనకంటే వాళ్లే ఎక్కువగా ఎదురుచూస్తున్నారట

2021-11-26 09:34:48 By Y Kalyani

img

ఐపీఓ కోసం మనకంటే వాళ్లే ఎక్కువగా ఎదురుచూస్తున్నారట

దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ LIC.  మార్కెట్ వాటాలో తిరుగులేని స్థానంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ త్వరలోనే IPOకు వస్తోంది. బాహుబలి ఐపీఓగా చెబుతున్న దీనిపై చాలామంది ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం టెక్నికల్ అంశాలను ఒక్కక్కటిగా పూర్తి చేసుకుంటూ త్వరలో మార్కెట్ ను హిట్ చేయడానికి సిద్దమవుతోంది. అయితే ఈ ఐపీఓ కోసం మనదేశంలో కంపెనీల కంటే కూడా విదేశీ ఇన్వెస్టర్లు ఎక్కువగా ఎదురుచూస్తున్నారు. వేల కోట్ల లిక్విడ్ చేతిలో పెట్టుకుని ఇందులో పెట్టబడి పెట్టడానికి రెడీ అయ్యారు.

లిస్ట్ పెద్దదే..
ప్రభుత్వం విదేశీ ఇన్వెస్టర్లకు, విదేశీ ప్రైవేటీ ఈక్విటీలకు కూడా LIC ఐపీఓలో పాల్గొనేందుకు అనుగుణంగా చట్టం తీసుకొస్తోంది. ఇందులో భాగంగా పలు కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. బ్లాక్‌స్టోన్, బ్లాక్‌రాక్, అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, సింగపూర్ ప్రభుత్వ ఇన్వెస్ట్‌మెంట్ కార్ప్ మరియు క్యాపిటల్ ఇంటర్నేషనల్ సహా గ్లోబల్ ఇన్వెస్టర్లు యాంకర్ బుక్ కేటాయింపులకు సంబంధించి ప్రాథమిక చర్చలు జరిపినట్లు తెలిసింది. CPPIB మరియు CDPQ, కాలిఫోర్నియా యూనివర్శిటీ ఎండోమెంట్, బ్రూక్‌ఫీల్డ్ మరియు కువైట్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, కెనడియన్ పెన్షన్ మేనేజర్‌లు ఈ వారం మరియు వచ్చే వారం ప్రారంభంలో సమావేశాలు నిర్వహించబోతున్నారని తెలుస్తోంది. 10 ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులు ఆయా కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నాయి. 
LICకి ఉన్న పేరు, మార్కెట్ వాటా ఇన్వెస్టర్లను ఆకర్శిస్తోంది. అ    యితే రిటైల్ ఇన్వెస్టర్లకు ఎంత కేటాయిస్తారు.. సంస్థాగత పెట్టబడిదారులకు ఏంత వాటా ఇస్తారన్నది ఇంకా తేలాల్సి ఉంది. 70వేల నుంచి లక్ష కోట్ల వరకూ IPO ద్వారా సమీకరించే అవకాశం ఉంది. 


LIC. ipo news investors

Expert's View


మంచి కంపెనీల IPO లకు ఎందుకు ఆదరణ కరువైంది ?

Trending