ఈ స్టాక్ పై లుక్ వేయండి.. హైదరాబాద్ ఫార్మా కీలక ఒప్పందాలు

2021-09-15 08:06:34 By Y Kalyani

img

ఈ స్టాక్ పై లుక్ వేయండి.. హైదరాబాద్ ఫార్మా కీలక ఒప్పందాలు

హైదరాబాద్ కు చెందిన ఫార్మా దిగ్గజం లారస్ కంపెనీ కీలక ఒప్పందాలు చేసుకుంది. పిల్లల్లో HIV చికిత్సలో ఉపయోగించే డ్రగ్స్ ను డెవలప్ చేసేందుకు గ్లోబల్‌ సంస్థలతో చేతులు కలిపింది. యునిటైడ్‌, క్లింటన్‌ హెల్త్‌ యాక్సెస్‌ ఇనిషియేటివ్‌ లతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నట్లు లారస్‌ ల్యాబ్స్‌ ప్రకటించింది.  సెబీకి కూడా సమాచారం అందించింది. ఒప్పందం ప్రకారం హెచ్‌ఐవీ లేదా ఎయిడ్స్‌ వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు అవసరమైన డ్రగ్‌ను యునిటైడ్‌, సీహెచ్‌ఏఐలతో కలిసి అభివృద్ధి చేయనుంది కంపెనీ. హెచ్‌ఐవీ వ్యాధి ఉన్న 90 శాతం మంది జీవించి ఉండేందుకు ఈ యాంటీ రెట్రోవైరల్‌ థెరపీ ఉపయోగపడుతుందని యూనిటైడ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఫిలిప్పీ డునేటన్‌ తెలిపారు. హెచ్‌ఐవీ పిల్లల జీవితాల్ని ఈ డ్రగ్‌ కాపాడుతుందని క్లింటన్‌ హెల్త్‌ సీఈవో అన్‌ వెనెమాన్‌ చెప్పారు. డ్రగ్‌ అభివృద్ధిపర్చే అవకాశం పట్ల లారస్‌ ల్యాబ్స్‌ వ్యవస్థాపకుడు, సీఈవో సత్యనారాయణ చావా ఆనందం వ్యక్తం చేశారు.

స్టాక్ దూకుడు

సో... కంపెనీ స్టాకుపై ఓ లుక్ వేయండి. ఇయర్ టు డేట్ ఈ షేరు ఏకంగా 83శాతానికి పైగా పెరిగింది. ఏడాదిలో అంటే 12 నెలల్లో ఏకంగా 142శాతం పెరిగింది. తాజా ఒప్పందాలతో మళ్లీ దూకుడుగా వెళ్లే అవకాశం ఉంది. తాజా ఒప్పందాలతో బుధవారం మాత్రం స్టాక్ గెయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. 


Laurus Labs Ltd laurus stock trading news

Expert's View


అవకాశం ఇచ్చిన tv5 నాయుడు గారికి | ఆదరిస్తున్న మీకు నా ధన్యవాదాలు

Trending