డ్రీమ్ రన్ కొనసాగిస్తున్న లాటెంట్ వ్యూ.. రెండు రోజుల్లో 43 శాతం జూమ్ చేసిన స్టాక్

2021-11-25 16:43:59 By VANI

img

లాటెంట్ వ్యూ అనలిటిక్స్ బంపర్ లిస్టింగ్ తర్వాత అద్దరగొడుతోంది. స్టాక్ మార్కెట్‌లో లాటెంట్ వ్యూ అనలిటిక్స్ డ్రీమ్ రన్ వరుసగా రెండో రోజున సైతం కొనసాగించింది. గురువారం వరుసగా రెండో రోజు స్టాక్ 20 శాతం అప్పర్ సర్క్యూట్‌కి చేరి రూ.702.35 వద్ద కొనసాగుతోంది. గత రెండు ట్రేడింగ్ రోజులలో స్టాక్ దాని బంపర్ లిస్టింగ్ తర్వాత 43 శాతం జూమ్ చేసింది. లాటెంట్ వ్యూ ఐపీఓ ద్వారా రూ.600 కోట్లను సమీకరించేందుకు మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఒక్కో షేరుకు రూ. 530, ఇష్యూ ధర రూ. 197తో పోలిస్తే 169 శాతం ప్రీమియం. గత రెండు రోజుల ర్యాలీతో స్టాక్ దాని ఇష్యూ ధర నుంచి 257 శాతం జూమ్ చేసింది.

 

బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో చేతులు మారుతున్న లాటెంట్ వ్యూ మొత్తం ఈక్విటీలో 12 శాతం అంటే 23.7 మిలియన్ ఈక్విటీ షేర్లతో ఈ కౌంటర్ భారీ ట్రేడింగ్ వాల్యూమ్‌లను చూసింది. రెండు ఎక్స్ఛేంజీలలో 300,000 షేర్ల కొనుగోలు ఆర్డర్‌లు పెండింగ్‌లో ఉన్నాయని డేటా చూపించింది. ఎస్అండ్‌పీ బీఎస్ఈ సెన్సెక్స్ మధ్యాహ్నం 02:22 గంటలకు 0.73 శాతం పెరిగి 58,768 వద్ద ఉంది. దేశంలోని ప్రముఖ ప్యూర్-ప్లే డేటా అనలిటిక్స్ సేవల కంపెనీలలో లాటెంట్ వ్యూ ఒకటి. కంపెనీ కన్సల్టింగ్ సర్వీసెస్, డేటా ఇంజనీరింగ్, బిజినెస్ అనలిటిక్స్ మరియు డిజిటల్ సొల్యూషన్స్ వంటి రంగాలలో పనిచేస్తుంది.


Latent View  BSE   NSE

Expert's View


మంచి కంపెనీల IPO లకు ఎందుకు ఆదరణ కరువైంది ?

Trending