టెస్లాకు ఆహ్వానం పలికిన కేటీఆర్

2022-01-15 09:31:07 By Y Kalyani

img

టెస్లాకు ఆహ్వానం పలికిన కేటీఆర్

తెలంగాణకు పెట్టుబడులు ఆహ్వానించడంలోనూ సాధించడంలోనూ కేటీఆర్ ఇప్పటికే విజయం సాధించారు. ప్రపంచంలోనే టాప్ 5 కంపెనీలు హైదరాబాద్ వచ్చేలా చేశారు. అమెజాన్, యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్ బుక్ సంస్థలు ఇక్కడ కార్యాలయాలు ఏర్పాటు చేశాయి. గతంలో ఉన్న కంపెనీలు కొత్తగా విస్తరించాయి. తాజాగా మరో Tesla కంపెనీని కూడా రప్పించే ప్రయత్నాలు మొదలుపెట్టారు కేటీఆర్. 

వ్యూహాత్మకంగా వ్యవహరించిన కేటీఆర్..
టెస్లా చీఫ్ ఇలాన్ మస్క్ చాలా విచిత్రమైన మనిషి. ఆయన నిర్ణయాలు అనూహ్యం. చర్యలు ఊహాతీతంగా ఉంటాయి. ఆయన్ను మెప్పించడం అంత సులభం కాదు. చర్చలు, ఫార్మాలిటీ మీటింగులు ఆయనకు ఇష్టం ఉండదు. అంతా సోషల్ మీడియా ద్వారానే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు. సరిగ్గా కేటీఆర్ కూడా ఆయన రూట్లోనే వెళ్లారు. ట్విటర్ ద్వారా తెలంగాణలో Tesla షోరూమ్ ఏర్పాటు చేయాలని కోరారు. అంతకుముందు ఇండియా నుంచి టెస్లా ఎప్పుడు రిలీజ్ చేస్తారని ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు మస్క్ సమాధానం ఇస్తూ ఇండియా ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయని.. ప్రభుత్వం నుంచి ఛాలెంజెస్ కారణంగా రాలేకపోతున్నామన్నారు. సాల్వ్ కావాలన్నారు. సరిగ్గా ఈ ట్వీట్ కు సమాధానంగా కేటీఆర్ తెలంగాణ బెస్ట్ ఆప్షన్ అని వస్తే సహకరిస్తామంటూ ట్వీట్ చేశారు. ఇంకా సమాధానం రాలేదు కానీ.. త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నారు.

హైదరాబాద్ లో FAANG+T
అమెరికా నాస్ డాక్ మార్కెట్లో FAANG+T షేర్లు ఫేమస్. టాప్ 6 ఇవే. ఇందులో F అంటే ఫేస్ బుక్, A అంటే యాపిల్, A అంటే అమెజాన్, N అంటే నెట్ ఫ్లిక్స్, G అంటే గూగుల్ ఈ కంపెనీలన్నీ హైదరాబాద్ లో ఉన్నాయి. ఇక అదనంగా FAANGకు కలిసిన T అంటే టెస్లా. ఇది కూడా వస్తుందని కేటీఆర్ ట్వీట్ చెబుతుంది. ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే జరిగితే చరిత్రే. 


KTR tesla elon musk tweet