కచోలియా పోర్ట్‌ఫోలియోలోని ఈ స్టాక్.. లాభాల కా బాప్.. లక్షకు ఐదేళ్లలో 34 లక్షలిచ్చింది..

2021-10-23 16:54:35 By VANI

img

అన్ని విషయాల్లో కాకున్నా.. కొన్ని విషయాల్లో మాత్రం లీడర్‌ని ఫాలో అవ్వాలి. మనకి అవగాహన లేనప్పుడు ఆయా రంగాల్లో లీడర్స్‌ను ఫాలో అయితే చాలు.. మనం ఆశించిన ప్రయోజనాన్ని చక్కగా పొందవచ్చు. ఇక స్టాక్ మార్కెట్ల విషయానికి వస్తే.. రాకేష్ ఝున్‌ఝున్‌వాలా, డాలీ ఖన్నా, విజయ్ కేడియా, ఆశిష్ కచోలియాలాంటి పెద్ద హ్యాండ్లు ఎందులో అయినా ఇన్వెస్ట్ చేస్తే వేరే ఆలోచనే లేకుండా జనం ఎందుకు ఫాలో అవుతారు. దీనికి కారణం వీరు పట్టిందల్లా బంగారం కావడమే.

 

స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్‌లో మంచి గ్రోత్ ఉన్న కంపెనీలను ముందుగానే పసిగట్టడంలో ఆశిష్ కచోలియా దిట్ట. ఇటీవల ముగిసిన సెప్టెంబర్ 2021 త్రైమాసికంలో ఆశిష్ కచోలియా తన పోర్ట్‌ఫోలియోకు క్వాలిటీ ఫార్మాస్యూటికల్స్ షేర్‌లను యాడ్ చేశారు. ఇది 2021లో మల్టీబ్యాగర్ స్టాక్‌లలో ఒకటి. వాస్తవానికి ఈ ఫార్మా స్టాక్ తన వాటాదారులకు అద్భుతమైన లాభాలను అందిస్తోంది. అంతేకాదు.. గత ఐదు సంవత్సరాలలో ఈ స్టాక్ దాదాపు 3270 శాతం పెరిగింది.

 

మార్కెట్‌లో కొన్ని స్టాక్స్‌ను కొనేసి.. పట్టుకుని.. ఇక దాని గురించి మరిచిపోవాలట. అలాంటి స్టాక్స్ దీర్ఘకాలంలో అద్భుతమైన రిటర్న్ ఇస్తాయి. అలాంటివే ఈ క్వాలిటీ ఫార్మా షేర్స్. ఈ ఫార్మా స్టాక్ గత ఐదేళ్లలో ఒక్కో షేరుకు రూ.25.80 నుంచి ఒక్కో స్థాయికి రూ.870కి పెరిగింది. ఈ కాలంలో దాదాపు 34 రెట్లు పెరిగింది. అంటే ఒక ఇన్వెస్టర్ ఈ స్టాక్‌లో లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి.. దానిని ఐదేళ్ల పాటు కొనసాగించిన వాళ్లకు రూ.34 లక్షలు అందించింది. 

 

ఆశిష్ కచోలియా విషయానికి వస్తే, ప్రైమ్ సెక్యూరిటీస్‌లో ఆయన తన కెరీర్ ప్రారంభించారు. అలానే ఎడెల్వైజ్ ఈక్విటీ రీసెర్చ్ డెస్క్‌లో కొన్ని రోజుల పాటు పని చేశారు. తర్వాత 2003లో లక్కీ సెక్యూరిటీస్ పేరుతో సొంతంగా వ్యాపారం ప్రారంభించారు. బిర్లాసాఫ్ట్, మాస్టెక్, పాలీమెడిక్యూర్, అపోలో ట్రైకోట్ ట్యూబ్స్, ఫిలిప్స్ కార్బన్, కేప్లిన్ పాయింట్ వంటి సంస్థలలో మైనర్ వాటాలను  కొనుగోలు చేయడం ద్వారా పోర్ట్‌ఫోలియో తయారు చేసుకుని ఏస్ ఇన్వెస్టర్‌గా అద్భుతమైన లాభాలను గడించారు.


Ashish Kacholia  Dolly Khanna  Vijay Kedia  Kwality Pharmaceuticals

Expert's View


మంచి కంపెనీల IPO లకు ఎందుకు ఆదరణ కరువైంది ?

Trending