-->

ఐటీ కంపెనీల జోష్

2021-01-13 21:52:50

img

త్రైమాసిక ఫలితాల్లో ఐటీ కంపెనీల జోష్
TCS, WIPRO, INFOSYS దూకుడు
అంచనాలు మించిన కంపెనీల ఫలితాలు
స్టాక్ మార్కెట్లోనూ ఐటీ షేర్లలో జోరు ఉంటుంది

అన్ని రంగాలపై కోవిడ్ తీవ్రంగా ప్రభావం చూపింది. అయినా ఐటీ ఇండస్ట్రీ మాత్రం రెవిన్యూలో దూకుడు ప్రదర్శిస్తున్నాయి. రేటింగ్ ఏజెన్సీలు వేసిన అంచనాలను మించి ఆర్థిక ఫలితాలు వెలువరిస్తున్నాయి. మార్చి లాక్ డౌన్ తర్వాత ఐటీ కంపెనీలపైనా కూడా ప్రభావం పడుతుందని అంచనా వేసినా.. పెద్దగా ఎఫెక్ట్ చూపలేదు. మెరుగైన పనితీరుతో ఆకట్టుకున్నాయి. ఆర్డర్ బుక్ కూడా నింపుకున్నాయి. తగ్గట్టే కంపెనీలు ఫలితాలున్నాయి. 


కంపెనీల ఫలితాలు...


Q3లో ఐటీ రంగంలో ముందుగా ఆర్ధిక ఫలితాలు వెలువరించిన TCS కంపెనీ ఏకంగా 7.2శాతం నెట్ ప్రాఫిట్ పెరిగి 8701 కోట్లుగా చూపించింది. వాస్తవానికి రేటింగ్ ఏజెన్సీలు 8,594 కోట్లు మాత్రమే అంచనాలు వేశాయి. కానీ ఎస్టిమేట్స్ దాటి లాభాలు ప్రకటించింది. ఆపరేటింగ్ ప్రాఫిట్స్ 6.36 శాతం పెరిగి 11,184 కోట్లుగా చూపించింది.  కంపెనీ రెవిన్యూ..  మొత్తం కంపెనీ ఆదాయం గత ఏడాదితో పోల్చితే 5.4శాతం పెరిగి 42015కోట్లుగా చూపించింది. అటు EPS కూడా 7.2శాతం పెరిగి 23.2 కోట్లుగా ఉంది. అటే ఇన్ ఫోసిస్ కూడా బుధవారం ప్రకటించిన ఫలితాల్లో నెట్ ప్రాఫిట్ ఏకంగా 16.8శాతం చూపించింది. ఇదే కాలానికి కంపెనీ 5215 కోట్లు లాభాలు ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలానికి కంపెనీ 4466 కోట్లు మాత్రమే లాభాలు ఇప్పించింది. విప్రో కూడా అంచనాలు మించి లాభాలు ప్రకటించింది.  గత ఏడాదితో పోల్చితే 20.8శాతం అధికంగా నెట్ ప్రాఫిట్ చూపించింది.  డిసెంబర్ తో ముగిసిన త్రైమాసికానికి కంపెనీ 2966 కోట్లు నెట్ ప్రాఫిట్ చూపించింది. గత ఏడాది ఇదే త్రైమాసికానికి 2455 కోట్లుగా ఉంది. పలు ఏజెన్సీల అంచనాలను కూడా మంచి ఫలితాలు ప్రకటించింది. ముగిసిన త్రైమాసికానికి 1.3శాతం పెరిగి మొత్తం 15,670 కోట్లు రెవిన్యూ సాధించింది. గత ఏడాది ఇదే కాలానికి కంపెనీ ఆదాయం 15,470 కోట్లుగా ఉంది. 3.7శాతం పెరిగింది. ఐటీ సర్వీసుల ద్వారా కంపెనీ ఆదాయం 2071 మిలియన్ డాలర్లుగా చూపించారు.  

మార్కెట్లో ఐటీ స్టాక్స్ హవా...


నాలుగో త్రైమాసికంలోనూ ఫలితాలు ఇదే రేంజిలో ఉంటాయనడంతో సందేహం లేదు.  దీంతో ఐటీ స్టాక్స్ పై అంచనాలు పెరుగుతున్నాయి. మార్కెట్లో షేర్లు జోష్ కొనసాగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నాయి. కంపెనీలు నిర్వహణ వ్యయం భారీగా తగ్గించుకున్నాయి. వర్క్ ఫ్రం హోం కారణంగా చాలావరకు వ్యయం తగ్గింది. అటు ఆర్డర్ బుక్స్ కూడా పెరిగాయి.  31 మార్చితో పోల్చుకుంటే ప్రస్తుతం నిఫ్టీ బెంచ్ మార్క్ 65శాతం వరకూ గెయిన్ అయింది.  మార్కెట్లో 10 ఏళ్ల గరిష్ట స్థాయి గెయిన్స్ 2021 రికార్డు చూపించింది. ఇందులో IT స్టాక్స్ పాత్ర కీలకంగా ఉన్నాయి.