-->

ఇంత వేగమా? మరి ఈ సమయంలో ఇన్వెస్ట్ చేయవచ్చా?

2021-01-13 09:42:08

img

ఇంత వేగమా? మరి ఈ సమయంలో ఇన్వెస్ట్ చేయవచ్చా?

 కొత్త మదుపుదారులకు సలహాలేంటి?

 మార్కెట్లో పరిస్థితులు సానుకూలమా? 

కరెక్షన్ భయాలేంత? 

ప్రాఫిట్ యువర్ ట్రేడ్ స్పెషల్ స్టోరీ

 

 స్టాక్ మార్కెట్లు కొతకొత్త గరిష్ట స్తాయిలో ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ, BSEలు పరుగులు తీస్తుండడంలో ఇన్వెస్టర్లకు కాసులు కురిపిస్తున్నాయి. ఇంత వేగంలో కొత్తగా మార్కెట్లోకి వస్తున్న ఇన్వెస్టర్లు ట్రేడింగ్ చేయవచ్చా.. వాళ్లలో ఎన్నోభయాలున్నాయి. వాస్తవానికి మార్కెట్లు ప్రజంట్ ఆకర్శిస్తున్నాయి. ఈ సమయంలో పెట్టాలని ఉంటుంది. పెడితే కరెక్షన్ లో కొట్టుకపోతామన్న భయాలూ ఉన్నాయి. మరి ఏం చేయాలి.? 

 

వాస్తవమేంటి? 

 

2020 సామాజికంగా, ఆర్థికంగా మనకు ఎన్నో పాఠాలు నేర్పింది. ఈక్విటీ మార్కెట్లు కూడా ఇన్వెస్టర్లకు ఓ మైలురాయి. వాస్తవానికి కోవిడ్ లాక్ డౌన్ ప్రకటించగానే.. మార్కెట్లు కుప్పకూలాయి. ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు పతనం బాట పట్టాయి. కానీ మళ్లీ అన్ లాక్, ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు, లిక్విడిటీ రూపంలో ఉద్దీపన చర్యలు మళ్లీ మార్కెట్లకు వచ్చేలా చేశాయి. పతనం నుంచి ఆల్ టైం గరిష్టస్థాయిని అందుకున్నాయి మార్కెట్లు. 2020 మొదట్లో బేరిష్ భయాల నుంచి 2021 జనవరి నాటికి బుల్లిష్ తో ఆల్ టైం రికార్డుకు చేరుకుంది. దీనివల్ల మనకొకటి అర్ధమవుతుంది. ప్రతి సంక్షోభం కూడా పాఠంగా మారుతుంది. వాస్తవానికి ఒకప్పటిలా సంక్షోభాలు మార్కెట్లపై ప్రభావం అంతంత మాత్రమే. 2008లో పరిస్థితి వేరు.. ఇకముందు వేరు అన్నది అర్ధమయింది. ఇక ముందు మార్చి లాంటి సింగిల్ డే పతనాలు ఉండకపోవచ్చు. కాబట్టి ఇన్వెస్టర్లు ఎలాంటి భయం లేకుండా మార్కెట్లో ట్రేడింగ్ చేయవచ్చు. కోవిడ్ స్ట్రెయిన్ భయాలు కూడా అవసరం లేదంటున్నారు. ముఖ్యంగా 2021లో. ఎందకంటే అన్నీ సానుకూల అంశాలే కనిపిస్తున్నాయి. 

 

ఆల్ టైం గరిష్టంలో ఇన్వెస్ట్ చేయవచ్చా? 

 

2021 మొదలవుతూనే మార్కెట్లు ఆల్ టైం గరిష్టస్థాయిలో ట్రేడ్ అవుతున్నాయి. మరి ఇది కంటిన్యూ అవుతుందా అన్నది ఇప్పుడు మదుపుదారుల్లో అనుమానం. అయితే ఈ భయాలు ఉండటం కూడా మంచిదే.. ఎందుకంటే కొన్ని స్టాక్స్ ప్రజంట్ ఓవర్ వాల్యూ ట్రేడ్ అవుతున్నాయి. అలాగని అన్ని స్టాక్స్ అలా లేవు కొన్ని మాత్రమే. క్వాలిటీ స్టాక్స్ చూసి ఇన్వెస్ట్ చేయవచ్చు. కేవలం స్పెక్యులేషన్ లేదా.. లక్ మీద ఆధారపడి ఉండే స్టాక్స్ కు దూరంగా ఉండండి. షార్ట్ టర్మ్ ప్రాఫిట్ కోసం భారీ ర్యాలీ అవుతున్న.. కంపెనీ ఒవర్ వాల్యూ ట్రేడ్ అయ్యే స్టాక్స్ కు దూరంగా ఉండండి. ఇవి ర్యాలీలో వందల రెట్లు పెరుగుతున్నాయి. తర్వాత మళ్లీ అత్యంత దారుణంగా పతనం వద్దకు చేరతాయి. దీనిపై మీరు సరైన సలహాలు తీసుకోవడం మంచిది. అదే సమయంలో మ్యూచువల్ ఫండ్స్ కూడా బెస్ట్ ఆప్షన్లలో ఒకటి. ఫండ్స్ ఎప్పుడూ రెండు మూడు కంపెనీలకు పరిమితం చేయకండి. ఎందుకంటే మార్కెట్లో ఇప్పుడున్న దూకుడు చూస్తుంటే.. ఖచ్చితంగా కరెక్షన్ పాయింట్ వస్తుందని అందరూ భావిస్తున్నారు.

 

బడ్జెట్ సమయంలో... 

 

మార్కెట్ ను కార్పొరేట్ ఫలితాలు బుల్లిష్ కంటిన్యూ అయ్యేలా చేస్తున్నాయి. ఈ సమయంలో బడ్జెట్ కూడా వస్తుంది కాబట్టి... ఎలా స్పందిస్తుందన్నది అంచనా వేయడం కష్టం. ఫండ్స్ డైవర్శిఫై చేసి.. ఇన్వెస్ట్ చేయండి. వివిద సెక్టార్లను ఎంచుకుని వాటిలో ఫండ్స్ డైవర్ట్ చేస్తే కరెక్షన్ వచ్చినా మినిమం ప్రాఫిట్స్ తో బయటపడే ఛాన్స్ ఉంటుంది. 

 

ముగింపు.. 

 

మార్కెట్లో కొత్తగా రావడానికి మంచి సమయమే.. కానీ జాగ్రత్తగా అడుగులు వేయాలి. నిపుణుల సలహాలు తీసుకుని మంచి క్వాలిటీ, వాల్యూ స్టాక్స్ , భవిష్యత్తు ఉన్న సెక్టార్లు చూసుకోవాలి.