DODLAకు భారీ స్పందన.. KIMSకు రెస్సాన్స్ ఓకే

2021-06-19 21:35:28 By Y Kalyani

img

DODLAకు భారీ స్పందన.. KIMSకు రెస్సాన్స్ ఓకే
తెలుగు సంస్థల IPOలకు భారీగానే స్పందన

హైదరాబాద్‌కు చెందిన కిమ్స్‌ హాస్పిటల్స్‌, దొడ్ల డెయిరీ ఐపీఓలకు మార్కెట్లో మంచి స్పందన వచ్చింది. షేర్లు తీసుకునేందుకు ఇన్వెస్టర్లు ఎగబడ్డారు. దొడ్ల డెయిరీ ఇష్యూకు 45.62 రెట్ల బిడ్లు వచ్చాయి. కిమ్స్‌ ఇష్యూకు 3.86 రెట్లు వచ్చింది. రూ.2,144 కోట్ల సేకరణ లక్ష్యంతో ఐపీఓకు వచ్చిన కిమ్స్‌ 1,44,13,073 ఈక్విటీ షేర్లను విక్రయానికి పెట్టగా.. మొత్తం 5,56,55,046 షేర్ల కొనుగోలుకు బిడ్లు దాఖలయ్యాయి. రూ.520 కోట్ల సమీకరణ లక్ష్యంతో IPOవచ్చిన దొడ్ల డెయిరీ 85,07,569 షేర్లను అమ్మకానికి పెట్టగా.. 38,80,64,950 షేర్ల కొనుగోలుకు బిడ్లు వచ్చాయి.

KIMS ఐపీఓకు...
QIPలు 5.26 
నాన్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్స్ 1.89
రిటైల్‌ ఇన్వెస్టర్లు 2.89
కంపెనీ ఉద్యోగులు 1.06

Dodla డెయిరీ... 
QIPలు 84.88
నాన్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్స్‌ 73.26
రిటైల్‌ ఇన్వెస్టర్లు 11.33


ipo market trends stocks bse nifty Dodla Kims