ఐపీఓలో తొందర వద్దు.. ముందుచూపు అవసరం

2021-12-06 11:48:51 By Y Kalyani

img

IPOలో తొందర వద్దు.. ముందుచూపు అవసరం
కంపెనీ మార్కెట్.. వాల్యేషన్ రివ్యూ అవసరం
సొంతంగా అంచనాకు రావాలి.. నిపుణుల సలహాలు తీసుకోవాలి
ప్రాఫిట్ యువర్ ట్రేడ్ స్పెషల్ స్టోరీ

స్టాక్ మార్కెట్ ను అర్థం చేసుకోకుండా అడుగుపెడితే పద్మవ్యూహం. అవగాహన పెంచుకుని వస్తే మంచి ఆదాయమార్గం.  గుడ్డిగా వస్తే మాయాజాలం.. అర్థం చేసుకుని వస్తే విజయం. స్టాక్ మార్కెట్ గొప్పతనం ఇది. అందుకే మార్కెట్లోకి వచ్చేముందు సొంతంగా పరిశోధన చేయాలి. ఫండమెంటల్స్ తెలుసుకోవాలి. తర్వాత అనుభవంతో ట్రేడింగ్ చేయాలి. అంతేకానీ ర్యాలీ చూసి గాలివాటంగా వస్తే ఉన్న అసెట్ మొత్తం కొట్టుకుపోతుంది. ముఖ్యంగా ప్రచారం చూసి తప్పటడుగులు వేయవద్దు. ఇదంతా ఎందుకూ అంటే.. ఇటీవల జరిగిన రెండు మూడు అనుభవాలున్నాయి.

IPO మాయాజాలం..
స్టాక్ మార్కెట్లో ప్రస్తుతం ఐపీఓ బూమ్ నడుస్తోంది. స్టాక్ మార్కెట్ ర్యాలీ చేస్తుంది కాబట్టి కంపెనీలు కూడా ఇదే తగిన సమయంగా భావించి IPOతో వస్తున్నాయి. ఇందులో సమర్ధత కలిగిన కంపెనీలున్నాయి. పనితీరు బాగాలేకపోయినా సొమ్ము చేసుకోవడానికి వస్తున్న సంస్థలున్నాయి. ముఖ్యంగా కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసిన బడా ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు లాభాలు జేబులో వేసుకోవడానికి IPO ద్వారా వచ్చి వాటాలు విక్రయిస్తున్నాయి. ఇలా వచ్చిన కంపెనీలే అత్యధికంగా ఉంటాయి. ఇలాంటి కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే సేకరించిన మొత్తంలో మెజార్టీ మనీ వారి జేబుల్లోకి పోతుంది. విస్తరణకు మూలధనం పెద్దగా వినియోగించరు. గత ఏడాది అంటే 2020లో కేవలం 16కంపెనీలు 26వేల కోట్లు నిధులు సమీకరిస్తే.. ఈ ఏడాది 2021లో ఇప్పటివరకూ 54 కంపెనీల లక్ష కోట్లకు పైగా సేకరించాయి. ఇందులో లాభాలు జేబులో వేసుకున్న కంపెనీలు ఎన్ని? విస్తరణకు నిధులు సమకూర్చుకున్న కంపెనీలు ఎన్ని? మీరు తెలుసుకుంటే ఇందులో మాయాజాలం కనిపిస్తుంది.  

PAYTM, STAR అనుభవాలు..
కొత్తగా మార్కెట్లోకి రావాలనుకుంటున్నవారు ఇటీవల ఐపీఓలో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. అయితే వారు కంపెనీపై అవగాహన కంటే కూడా ప్రచారాన్ని ఎక్కువగా నమ్ముకుంటున్నారు. అలా నష్టపోయినవారిలో పేటీఏమ్ బ్యాచ్ కూడా ఉన్నారు. PAYTM ఐపీఓపై భారీగా ప్రచారం జరిగింది. అంతేకాదు విపరీతమైన వాల్యేషన్ కూడా చూపించారు. నష్టాల్లో ఉన్న కంపెనీ కూడా లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ చూపించారు. అంతకుముందు జోమోటో ఆకట్టుకోవడంతో యూనికార్న్ కూడా ఫుల్లుగా లాభాలు ఇస్తుందని ప్రచారం చేశారు. సోషల్ మీడియా అంతా కోడై కూసింది. బ్రోకరేజి సంస్థలు, నిపుణులు హెచ్చరించినా కూడా వాటి కంటే సోషల్ మీడియా ప్రచారం ఎక్కువగా జనాలకు చేరింది. చివరకు లిస్టింగ్ రోజు షేరు 40శాతం పడిపోయి తీవ్ర నష్టాల పాలైంది. జోమోటో లిస్టింగ్ లాభాలు తీసుకున్నవాళ్లు కూడా భారీగా పెట్టారు. కానీ నష్టాల పాలయ్యారు.
ఇప్పుడు స్టార్ హెల్త్ కూడా పలు అనుమాలకు తావిస్తోంది. కేవలం రాకేష్ ఝన్ ఝన్ వాలాకు ఇందులో 17శాతం వరకూ వాటా ఉంది. మంచి ఇన్వెస్టర్ కావచ్చు కానీ.. ఆయనకు వాటా ఉందని ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. ఎట్టికేలకు పేటీఎమ్ ఎఫెక్ట్ తో స్టార్ కు ఇన్వెస్టర్లు పెద్దగా ఆసక్తి చూపలేదు. 79శాతం మాత్రమే సబ్ స్క్రిప్షన్ వచ్చింది. మార్కెట్ క్యాప్ అధికంగా ఉంది. పైగా ఇందులో ఇన్వెస్టర్ల వాటాలు అధికంగా విక్రయిస్తున్నారు. 
 
ధరఖాస్తు చేసేముందు..
కంపెనీ ప్రొఫైల్ చూడండి. లాభనష్టాలు అంచనా వేయండి. దీంతో పాటు ఫ్యూచర్ మార్కెట్.. కంపెనీ టార్గెట్ చేసి మార్కెట్ కీలకం. నైకా కంపెనీ ఖచ్చితంగా లాభపడుతుంది. ఎందుకంటే బ్యూటీ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా మార్కెట్ వస్తోంది. ఫలితం షేర్లూ లాభపడ్డాయి. అలాగే ఫార్మా, డిఫెన్స్ సెక్టార్లలో కూడా ఫ్యూచర్ ఉంటుంది. అంతేకానీ.. పోటీ ఎక్కువ ఉన్న కంపెనీల్లో హై వాల్యేషన్ వద్ద వస్తే IPOకు ధరఖాస్తు చేయడం దండగ. కంపెనీ IPOకు వస్తుంటే.. అప్పులు తీర్చడానికి వస్తుందా? విస్తరణకు వస్తుందా? లేక అందులో ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు వాటాలు అమ్ముకుంటున్నారా అన్నది కీలకం. 

ప్రచారం కాదు.. నిపుణులు సలహాలు 
కొత్తగా కోట్లమంది యువ ఇన్వెస్టర్లు వస్తున్నారు. కొత్తతరం కంపెనీలు మార్కెట్లోకి రావడం కూడా మంచిదే కానీ అందులో ఏది మంచిది.. ఏది కాదు అనేది తెలుసుకోవాలి. దీనికి సోషల్ మీడియా ఎప్పుడు కూడా వేదిక కాదు. ఇటీవల మార్కెటింగ్ స్ట్రాటజీలో భాగంగా నిపుణులు కూడాకంపెనీలతో టై అప్ అయి.. సోషల్ మీడియాలో అభిప్రాయాలు ఉంచుతారు. అలాకాకుండా నేరుగా మాట్లాడి నిర్ణయం తీసుకోవడం మంచిది. 

Note తెలుగు ఇన్వెస్టర్లకు ఖచ్చితమైన సమాచారం, అవగాహన  కావాలంటే https://www.profityourtrade.in/ సబ్ స్క్రైబ్ చేయండి. దశాబ్ధాల stock market అనుభవం ఉన్న కుటుంబరావు గారు, వసంత్ కుమార్ వంటి నిపుణులు మీకు అండగా ఉంటారు. ఇన్వెస్టర్ల ప్రయోజనాలు కాపాడే విషయంలో టీవీ5 బిజినెస్ ఎడిటర్ వసంత్ గారు రాజీపడరు. ఆయన టీం ఎంతోకాలంగా ఇన్వెస్టర్లకు అండగా ఉంది. మంచి సలహాలు, సూచనలతో వస్తారు. 


IPO News IPO IPO Updates