రియాల్టీ రంగంలో డబ్బే డబ్బు.. వద్దంటే పెట్టుబడులు

2021-07-21 23:18:33 By Y Kalyani

img

రియాల్టీ రంగంలో డబ్బే డబ్బు.. వద్దంటే పెట్టుబడులు

కొవిడ్ కారణంగా రియాల్టీ రంగం తీవ్రంగానష్టపోయినా కూడా మెజార్టీ ఇన్వెస్టర్లు దీనిపైనే ఫోకస్ చేస్తున్నారు. ఈ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి బడా ఇన్వెస్టర్లు.. FDIలు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ రియాల్టీ కన్సల్టెంట్ సంస్థ కొలియర్స్ చెప్పింది. రియాల్టీలో ఇన్వెస్టిమెంట్ పై తాజాగా నివేదిక విడుదల చేసింది. ఇందులో భాగంగా ఈ ఏడాది దేశీయ రియాల్టీ సెక్టార్ లో 37వేల కోట్ల వరకూ పెట్టుబడులు వస్తాయని అంచనా వేసింది. 2020లో ఈ రంగంలో మొత్తం 4.8 బిలియన్ డాలర్లు పెట్టుబడులు రాగా.. ఈ ఏడాది 6 నెలల్లోనే సుమారు 3 బిలియన్ డాలర్లు వచ్చినట్టు చెబుతోంది రిపోర్ట్. గత ఏడాది కంటే ఇది డబుల్ దమాకా. కమర్శియల్ స్పేస్ విభాగంలో భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. మొత్తం పెట్టుబడుల్లో వీటి వాటా 35 శాతంగా ఉంది. 
జనవరి- జూన్‌ మధ్య ఇండస్ట్రీయల్, గోడాన్స్ విభాగంలో 775 మిలియన్‌ డాలర్లు పెట్టుబడులు వచ్చాయి. 2016 తర్వాత ఒక ఏడాదిలో వచ్చిన అత్యధిక పెట్టుబడులు ఇవే. స్థిరాస్తిలో సంస్థాగత పెట్టుబడుల్లో వీటి వాటా 27 శాతం. 


realty real estate investments