ఇన్సూరెన్స్ కంపెనీలకు వాచిపోయిన క్లెయిమ్స్

2022-05-13 23:25:02 By Y Kalyani

img

ఇన్సూరెన్స్ కంపెనీలకు వాచిపోయిన క్లెయిమ్స్
లక్షల్లో మరణాలు.. 16వేల కోట్ల చెల్లింపులు

ఇన్సూరెన్స్ రంగానికి కోవిడ్ కలిసొచ్చిందో... నష్టాల పాలు చేసిందో అర్ధం కావడం లేదు. ఇదో కష్టసుఖాల కథలా మారింది. అటు భారీగా క్లెయిములు చెల్లించాల్సి వచ్చినందుకు బాధపడాలో.. లేక ప్రజల్లో బీమా పట్ల అవగాహన పెరిగి ప్రీమియంలు పెరుగుతున్నందుకు సంతోషపడాలో అర్థం కాని పరిస్థితి. 

లెక్కలు చూస్తే...
లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ సమాచారం ప్రకారం జీవిత బీమా కంపెనీలు ఇప్పటివరకు రూ. 16921.70 కోట్ల మొత్తం క్లెయిమ్స్ చెల్లించింది. సుమారు 2లక్షల 18 వేల 084 మంది  కోవిడ్ క్లెయిమ్‌లను అందుకున్నారు. సెకండ్ వేవ్ సమయంలో మరణాల భారీగా నమోదయ్యాయి. 2021లో డెత్ క్లెయిమ్‌లు భారీగా పెరిగాయని బీమా సంస్థలు చెబుతున్నాయి. 2వ వేవ్ సమయంలో ఇన్సూరెన్స్ కంపెనీలు కోవిడ్, నాన్-కోవిడ్ కేటగిరీల కింద డెత్ క్లెయిమ్‌లు కొన్ని రెట్లు పెరిగాయి. వాస్తవానికి ఇది కూడా తక్కువే అంటున్నాయి IMA వర్గాలు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించిన 50 లక్షల బీమా పథకం కింది ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు సగంమందికి కూడా క్లెయిములు అందలేదన్నది ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం దేశంలో మొత్తం 5,24,190 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. మరణించిన వారిలో 41 శాతం మందికి జీవిత బీమా పాలసీ ఉందని గణాంకాలు సూచిస్తున్నాయి. 

పెరిగిన పాలసీదారులు..
ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (IRDA) డేటా ప్రకారం జీవిత బీమా రంగంలో గ్రోత్ పెరుగుతోంది. 2019-20లో 2.82 శాతంతో పోలిస్తే 2020-21లో 3.20 శాతానికి పెరిగింది.  ఉంది.
మొత్తానికి అటు క్లెయిముల భారం కంపెనీలకు లాభాలను తగ్గించినా పెరుగుతున్న ప్రీమియంలపై ఆశలు పెట్టుకున్నాయి కంపెనీలు. 


covid corona insurence

Expert's View


ఏ దేశ ద్రవ్యోల్బణం చూసినా ఏముంది గర్వకారణం ?

Trending