-->

అంచనాలను మించిన ఇన్ఫోసిస్‌ క్యూ-3 రిజల్ట్స్

2021-01-13 16:45:12

img

డిసెంబర్ 31తో ముగిసిన మూడో త్రైమాసికానికి సంబంధిచిన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది ఐటీ మేజర్‌ ఇన్ఫోసిస్‌. స్టాక్‌ మార్కెట్‌ ఎనలిస్టుల అంచనాలను అధిగమిస్తూ ఈ ఫలితాలను కంపెనీ ప్రకటించింది. ఇయర్‌ ఆన్‌ ఇయర్‌లో కంపెనీ నికరలాభం 16.60శాతం వృద్ధితో రూ.5197 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఏడాది ఇదే సమయంలో కంపెనీ నికరలాభం రూ.4457 కోట్లుగా ఉంది. క్యూఆన్‌క్యూలో కంపెనీ నికరలాభం 7.3శాతం పెరిగింది.

కంపెనీ మొత్తం ఆదాయం ఇయర్‌ ఆన్‌ ఇయర్‌లో 12.27శాతం పెరిగి రూ.25927 కోట్లుగా ఉంది. గత 8 సంవత్సరాల్లో కంపెనీ ఆదాయంలో ఇంతటి వృద్ధి నమోదు కావడం ఇదే తొలిసారి. డాలర్‌ రూపంలో కంపెనీ ఆదాయం 8.4శాతం వృద్ధితో $3,516 మిలియన్లుగా నమోదైంది. రెవిన్యూ గైడెన్స్‌ 4.5-5.0శాతానికి, మార్జిన్‌ గైడెన్స్‌ 24శాతం నుంచి 24.5శాతానికి కంపెనీ పెంచింది.