స్టాక్ మార్కెట్లలో హ్యాట్రిక్ జోష్ కన్పిస్తోంది. ఓపెనింగ్‌లోనే నిఫ్టీ 130 పాయింట్లు లాభపడింది. దీంతో 15వేల పాయింట్ల మార్క్‌పైనే నిఫ్టీ ఆరంభమైనట్లైంది
బుధవారం సెషన్లో నిఫ్టీ 130పాయింట్లు లాభపడింది..సెన్సెక్స్ 376 పాయింట్లు లాభపడింది. బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివ్‌గా ప్రారంభమైంది. మిడ్ క్యాప్ ఇండెక్స్ ఒకశాతం వరకూ పెరిగింది.గ్లోబల్ క్యూస్ మిక్స్‌డ్‌గా ఉన్నా, మన మార్కెట్లు మాత్రం వరస సెషన్లలో లాభపడుతూ కొత్త గరిష్టాల దిశగా దూసుకువెళ్తున్నాయి.
నిఫ్టీ గెయినర్లలో హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్స్,టాటా స్టీల్, హెచ్‌డిఎఫ్‌సి, ఓఎన్జిసి 4 నుంచి ఒకటిన్నర శాతం వరకూ పెరిగాయి. లూజర్ల విషయానికి వస్తే,బజాజ్ ఆటో, హీరో మోటర్స్,ఎం అండ్ ఎం స్వల్పనష్టాల్లో ట్రేడవుతున్నాయ్.
యాక్టివ్ స్టాక్స్‌లో హెచ్‌డిఎఫ్‌సి ట్విన్స్, ఇన్ఫోసిస్ , భారతి ఎయిర్టెల్, అదానీ పోర్ట్స్ ఉన్నాయి. పై పిక్చర్ చూస్తే..నిన్న ఆటో స్టాక్స్‌లో ర్యాలీ కనబడగా..ఇవాళ వాటిలో కాస్త ప్రాఫిట్ బుకింగ్ చోటు చేసుకుంటున్నట్లు అర్ధమవుతోంది.
స్టోరీ పబ్లిష్ చేసే సమయానికి నిఫ్టీ 112 పాయింట్ల లాభంతో 15031 పాయింట్ల వద్ద , సెన్సెక్స్ 362 పాయింట్ల లాభంతో 50659 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయ్