బెంజ్ కారు బెంజే.. తగ్గేదే లే

2022-01-13 22:53:52 By Y Kalyani

img

బెంజ్ కారు బెంజే.. తగ్గేదే లే
ఇండియాలో ఇప్పటికీ మోస్ట్ వాంటెడ్

దేశీయ లగ్జరీ కార్ల మార్కెట్లో బెంజ్ కారు ఏమాత్రం తగ్గడం లేదు. ఇండియాలో రిచ్ పీపుల్ అంతా కూడా దీనిపైనే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఆడి మరియు బిఎమ్‌డబ్ల్యూతో పోల్చితే 2021లో మెర్సిడెస్ బెంజ్ మరోసారి ఇష్టమైన లగ్జరీ కార్ బ్రాండ్‌గా అవతరించింది. జర్మన్ ఆటో మేకర్ భారతీయ మార్కెట్లో ఏకంగా 11,242 యూనిట్లను విక్రయించింది. గత ఏడాదితో పోల్చితే 42.5 శాతం వృద్ధిని నమోదు చేసింది. డిమాండ్ పెరగడంతో మోడల్స్ విషయంలో కూడా రాజీపడటం లేదు. కొత్త కొత్త వేరియంట్లు తీసుకొస్తోంది.  మెర్సిడెస్-బెంజ్ తన పోర్ట్‌ఫోలియోలో భారతీయ కస్టమర్ల కోసం మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ లగ్జరీ సెడాన్ EQSని తీసుకొస్తోంది. ఈ లగ్జరీ EV భారతదేశంలో ఉత్పత్తి చేస్తున్నారు.  Mercedes-Benz AMG పోర్ట్‌ఫోలియో నుండి అనేక ఇతర అద్భుతమైన ఆఫర్‌లతో పాటు కొత్త S-క్లాస్ మేబ్యాక్ మరియు EQSలను కూడా విడుదల చేస్తుంది. 2021లో, లాంగ్ వీల్‌బేస్ E-క్లాస్ అత్యధికంగా అమ్ముడైన మెర్సిడెస్-బెంజ్ మోడల్‌గా నిలిచింది. తర్వాత GLC SUV ఉంది.

BMW తక్కువేం కాదు... 
BMW కూడా గత ఏడాది భారతదేశంలో మంచి వృద్ధిని సాధించింది. గత సంవత్సరంతో పోల్చితే 35 శాతం అమ్మకాలు పెరిగాయి. కంపెనీ 640 మినీ యూనిట్లు మరియు 5,191 మోటార్‌సైకిళ్లతో సహా 8,876 కార్లను డెలివరీ చేసింది.

Audi కూడా అదరగొట్టింది..
ఆడి ఇండియా 2021లో 3,293 కార్లను విక్రయించింది. ఇది సంవత్సరానికి 101 శాతం వృద్ధిని సాధించింది. e-tron 50, e-tron 55, e-tron Sportback 55, e-tron GT, RS e-tron GT వంటి ఎలక్ట్రిక్ కార్లతో వాహనదారులను ఆకట్టుకుంటోంది. ఆడి ఇప్పుడు భారతదేశంలో తన next Zen ఆడి క్యూ7 కోసం బుకింగ్‌లను ప్రారంభించింది. 

జాగ్వార్ ల్యాండ్ రోవర్, వోల్వో వంటి బ్రాండ్‌లు గత నెలలో అమ్మకాలు తగ్గాయి. గడిచిన నెలలో 194 యూనిట్ల నుండి 154 యూనిట్లకు తగ్గింది. వోల్వో గత నెలలో 117 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. పోర్స్చే మాత్రం సానుకూల వృద్ధిని సాధించింది. గత నెలలో 47 యూనిట్లు అమ్మింది. Rolls-Royce, Lamborghini, Bentley, Rolls-Royce వంటి ప్రీమియం లగ్జరీ బ్రాండ్లు డిసెంబర్ 2021లో నాలుగు యూనిట్లకు రిజిస్ట్రేషన్లు పెరిగాయి. లాంబోర్ఘిని మరియు బెంట్లీ గత నెలలో ఒక్కొక్క యూనిట్ విక్రయించాయి.


audi bmw benz merc cars market