మార్కెట్లో డబ్బులే.. డబ్బులు.. తొవ్వుకున్నోళ్లకు తొవ్వుకున్నంత

2021-06-10 22:54:51 By Y Kalyani

img

మార్కెట్లో డబ్బులే.. డబ్బులు.. తొవ్వుకున్నోళ్లకు తొవ్వుకున్నంత

ఏమాటకామాట చెప్పాలి.. క్రిప్టో కరెన్సీ అంతా మాయ.. జగన్మాయ అంటారు కానీ అందులో ఆదాయం మాత్రం అదుర్స్ అంటున్నారు ఇన్వెస్టర్లు. దీనికి సంబంధించి తాజా లెక్కలు చూస్తే అర్ధమవుతోంది. గడిచిన ఏడాదిగా ముఖ్యంగా బిట్ కాయన్ దుమ్మురేపుతోంది. ఫుల్ గెయిన్స్. ఈ దశాబ్ధం స్టార్టింగ్ సంచలనం బిట్ కాయన్ ఇన్వెస్టర్లతో దోబూచులాడుతోంది. ఒకసారి కొనమంటారు.. మరోసారి ప్రమాదం అని వార్తలొస్తాయి. ఏది ఏమైనా గూగుల్, యాపిల్, టెస్లా వంటి బడా కంపెనీలే కొనడంతో డిమాండ్ పెరిగింది. ధర పెరిగింది. ఫైనల్ గా ఇది ఇన్వెస్టర్లకు సంపద పెంచింది.
డబ్బే డబ్బు... 
అమెరికాలో బిట్ కాయన్ వల్ల ఇన్వెస్టర్లు భారీగా లాభపడ్డారు. 2020లో అమెరికన్ ఇన్వెస్టర్లు ఏకంగా 4.1 బిలియన్ డాలర్ల లాభం పొందారు. అంటే మన కరెన్సీలో సుమారు రూ.30వేల కోట్లు. ఈ తర్వాత స్థానంలో చైనా ఉంది. ఇక్కడ పెట్టుబడి దారులు బిట్ కాయన్ ద్వారా పెట్టిన డబ్బుపై  1.1 బిలియన్ డాలర్లు లాభం పొందారు. అంటే 9వేల కోట్లు పైమాటే. ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది కానీ లేకపోతే ఇంకా ఎక్కువే ఉండేదని చైనా ఆర్ధిక వేత్తలు అంటున్నారు. జపాన్, యూకే, రష్యా, జర్మనీ వంటి దేశాలు కూడా 1 బిలియన్ లోపు ఉన్నాయి. 
ఇండియాలో....
మనదేశం ప్రపంచంలో అతిపెద్ద 5వ ఆర్థిక వ్యవస్థగా ఉంది. జీడీపీ 2.9 ట్రిలియన్ డాలర్లు. కానీ బిట్ కాయన్ పెట్టుబడిలో ఎక్కడో వెనకబడి ఉన్నాం. అంతేకాదు గెయిన్స్ కూడా కేవలం 241 మిలియన్ డాలర్లు మాత్రమే. అయితే ముందు నుంచి మనదేశంలో సంస్థాగతంగానూ, వ్యక్తిగతంగానూ క్రిప్టోను ప్రోత్సహించడం లేదు. దీంతో పెద్దగా ఇన్వెస్టర్లు ఆసక్తి చూపడం లేదు. వాస్తవానికి పెట్టినోడికి పెట్టినంత.. తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత లాభం.


bitcoin stock market crypto currency profit trading musk elon

Expert's View


నేను వేసుకున్న కోటు రంగు , రానున్న రోజుల్లో మార్కెట్ల రంగు ఇదేనా ?

Trending