చైనా అమెరికా కలిపితే భారత్ ఫ్యూచర్ స్టాక్ మార్కెట్

2021-10-14 23:01:20 By Y Kalyani

img

చైనా అమెరికా కలిపితే  భారత్ ఫ్యూచర్ స్టాక్ మార్కెట్
లాంగ్ బుల్ రన్ చూడబోతున్నామంటున్న నిపుణులు
ఇన్వెస్టర్లు భయపడాల్సిన అవసరం లేదా
ప్రాఫిట్ యువర్ ట్రేడ్ స్పెషల్ స్టోరీ

సహజంగానే స్టాక్ మార్కెట్ పరుగులు తీస్తుంటే మనకు భయపడటం అలవాటు. బబుల్ పేలిపోతుందేమో.. పతనం అయితే నష్టపోతామా? అన్న సందేహాలు వస్తుంటాయి. గతంలో అనుభవాలు కూడా అంతే ఉన్నాయి. కానీ గడిచిన 18 నెలలుగా దేశీయ సూచీలు వెనుదిరిగిచూడకుండా పరుగులు తీస్తూనే ఉంది. 2020 మార్చి నుంచి స్టాక్ మార్కెట్ అసలైన్ బుల్లిష్ చూపించింది. మరి ఇది కూడా మరో బుడగేనా.. దీనిని చూసి భయపడాలా.. లేక బుల్లిష్ పై ఆశలు సజీవంగా ఉంచుకోవాలా.. అంటే కొందరు నిపుణులు చెబుతున్న మాటలు ఆసక్తికరంగా ఉన్నాయి. అవేంటో మనమూ చూద్దాం..

షో ఇంకా ఉంది..
దేశీయ స్టాక్ మార్కెట్ బుల్లిష్ ఆరంభం మాత్రమే అంటున్నారు. ఈ పరుగు మరికొన్ని సంవత్సరాలు ఉంటుందన్నది నిపుణులు వాదన. తక్కువ సమయం ఉండే బుల్లిష్ అంతకన్నా కాదు. ఆర్డినరీ ట్రెండ్ కూడా కాదు. ఎక్స్ట్రార్డినరీ టైమ్స్. మరికొన్నేళ్లు చూడబోతున్నాం. 2020 మార్చి పతనం నుంచి చూసింది ప్రారంభమే అంటున్నారు. అమెరికా, చైనాల గురించి మాట్లాడిన మనం ఇప్పుడు మనకు టైం వచ్చింది. ఇటీవల ప్రముఖ ఏస్ ఇన్వెస్టర్ రాకేష్ ఝన్ ఝన్ వాలా చెప్పినట్టు హమారా భారత్ కా టైమ్ ఆయేగా నై... టైమ్ ఆగయా అని.. మన సమయం వచ్చేసింది. మార్కెట్ ఇక దూకుడు మరింత చూడబోతున్నామని అంటున్నారు. ఆయనే కాదు జాతీయ అంతర్జాతీయ మార్కెట్ ఎనలిస్టులు కూడా అదే అంచనా వేస్తున్నారు. లేదంటే అంత తేలిగ్గా లక్షల కోట్లు భారతీయ మార్కెట్లో పెట్టగలరా.

ఫార్ములా ఇదేనంటున్న నిపుణులు...
మార్కెట్ గడిచిన ఐదు, పదేళ్లుగా మనం సింగిల్, లో సింగిల్ డిజిట్ గ్రోత్ చూశాం.. కానీ అంతకుమించి ఇక చూడబోతున్నామని అంటున్నారు. ఇది ఇంతటితో ఆగదు. రానున్న ఐదు, పదేళ్లు మనం మల్టీ ఇయర్ బుల్లిష్ తో డబుల్ డిజిట్ గ్రోత్ చూస్తామని ధీమాతో ఉన్నారు.
వాస్తవానికి మనం బిగ్గర్ ఎకానమీ వైపుగా అడుగులు వేస్తున్నాం. ఇప్పటికే అతిపెద్ద ఐదో ఆర్ధిక వ్యవస్థగా ఉన్నాం. గత 12 ఏళ్లుగా అమెరికా టెక్నాలజీ సాయంతో ఆర్ధికంగా బలపడింది. అటు మార్కెట్లు బుల్లిష్ తో స్టాక్స్ ఎక్కడికో పోయాయి. లాంగ్ బుల్ పరుగులు చూశాం. అంతకుముందు మానుఫాక్చరింగ్ సెక్టార్, తర్వాత టెక్నాలజీ అందుకున్నాయి. సరిగ్గా చైనా కూడా ఇదే ఫాలో అయింది.  ముఖ్యంగా ఉత్పత్తి రంగం సాయంతో చైనా స్టాక్ మార్కెట్లు సుదీర్ఘకాలం పాలు బుల్లిష్ చూశాయి. ఇన్వెస్టర్లకు సంపద పెంచాయి. 
మనకు ఇప్పుడు అడ్వాంటేజ్ అదే. ఇక్కడ టెక్నాలజీ బూమ్ అందుకుంది. అటు అంతర్జాతీయంగా మారిన పరిస్థితులతో  ఉత్పత్తి రంగం పరుగులు తీస్తోంది. మొత్తంగా భారత్ రానున్న 10 ఏళ్ల భారీగా పెట్టుబడులతో పాటు.. కేపిటల్ మార్కెట్ లో ఏసియా రారాజుగా ఉండే అవకాశం ఉంది. దీంతో పాటు మనకు ఉన్న జనాభా కారణంగా కన్జూమర్ బిజినెస్ అదనపు బలం. సో మనముందు అధ్బుతమైన ఫ్యూచర్ కనపడుతోంది. 3 ట్రిలియన్ డాలర్ల నుంచి 5 ట్రిలియన్ డాలర్లకు ఎదుగుతున్న భారత్ లో కేపిటల్ మార్కెట్ కూడా అంతే వేగంగా పెరగడం ఖాయం. 

మధ్యలో స్పీడ్ బ్రేకర్లు..
ఫార్మా, ఐటీ, ఆటో, కన్షూమర్ రంగాల్లో భారత్ అతిపెద్ద మార్కెట్ గా అవతరించబోతుంది. ఇప్పటికే ఈవీ రంగంలో భారత్ వైపు ప్రపంచదేశాలు చూస్తున్నాయి. అటు ఫార్మాలో తిరుగులేనిస్థానంలో ఉన్నాం. ఐటీ సెక్టార్ స్పీడ్ పెరుగుతోంది. ఆయా సెక్టార్లు రానున్న సంవత్సరాల్లో సరికొత్త రికార్డుల వైపు పరుగులు తీస్తున్నాయి. అంతే కాదు.. మనదేశంలో బిలియన్ డాలర్ల టెక్ స్టార్టప్ కంపెనీలు ఇంకా వందల్లో ఉన్నాయి. అవన్నీ  స్టాక్ మార్కెట్ లిస్టింగ్ క్యూ కట్టనున్నాయి. అమెరికాలో FAANG కంపెనీల గురించి కాదు... భారత్ లో వచ్చే టెక్ దిగ్గజాల గురించి చరిత్ర చెప్పుకోబోతుంది.. సొ... స్టాక్ మార్కెట్ ఇప్పుడు పెట్టే రూపాయి.. సహనంతో ఉంటే వంద అవడానికి ఎంతోకాలం పట్టదన్నది నిపుణులు వాదన. మధ్యలో వచ్చే చిన్నచిన్న మార్పులకు.. అనిశ్చితిని తట్టుకోవాల్సి ఉంటుంది. 


market shares stocks bse nifty

Expert's View


మంచి కంపెనీల IPO లకు ఎందుకు ఆదరణ కరువైంది ?

Trending