ఇండియా నుంచి Tesla పాయె

2022-05-12 22:57:33 By Y Kalyani

img

ఇండియా నుంచి Tesla పాయె
ఇండోనేషియాలో ప్లాంట్ కు గ్రీన్ సిగ్నల్
హుండాయ్ కంపెనీ కూడా అక్కడే
భారత్ వైఫల్యాలను అనుకూలంగా మలుచుకున్న దేశం

పెట్టుబడులకు స్వర్గాధామంగా ఇండియా అని చెబుతున్న మాటలే నీటిమూటలు అని తేలుతున్నాయి. మాటలే కానీ.. చేతల్లో పరిశ్రమలను ఆకట్టుకోవడంలో విఫలమవుతున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల కాలంలో ఇండియాకు రావాల్సిన పరిశ్రమలే కాదు.. చైనా నుంచి తరలిపోతున్న కంపెనీలు కూడా ఇండియాలో అడుగుపెట్టడానికి ఆసక్తిచూపడం లేదు. ఇండోనేషియా వారికి బెస్ట్ ఛాయిస్ గా మారింది. తాజాగా Tesla కంపెనీ కూడా వేల కోట్లు పెట్టుబడుల కోసం ఇండోనేషియా ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది.

ఇండోనేషియా పాలసీ...
భారత్ లో ఇప్పటికీ కఠినమైన పాలసీలున్నాయి. వాస్తవానికి సంస్కరణలు వచ్చినా కూడా విదేశీ కంపెనీలను ఆకట్టుకోవడం లేదు. కానీ పక్కనున్న ఇండోనేషియా ఆయ సంస్థలకు రాయితీలు, రకరకాల ప్రోత్సహకాలు అందిస్తోంది. దీంతో పలు కంపెనీలు గడిచిన కొద్ది మాసాల్లనే భారీ ఒప్పందాలు చేసుకుంది. ఇండోనేషియా ఇటీవలి నెలల్లో అనేక రకాల ప్రోత్సాహకాలతో అనేక బ్యాటరీ మరియు కార్ల తయారీదారులను ఆకర్షించింది.  బిలియన్ల డాలర్లను ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొస్తున్నాయి కంపెనీలు. LG ఎనర్జీ సొల్యూషన్, సుమారు $9 బిలియన్లను పెట్టుబడి పెడుతోంది. హ్యుందాయ్ మోటార్ సంస్థ బ్యాటరీ ప్లాంట్‌ను కూడా అభివృద్ధి చేస్తోంది. Amperex Technology Co. కూడా అక్కడే 6 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తోంది. 

విధానాలపై అనుమానాలు..
ఇండియాలో 2030 నాటికి విద్యుత్ వాహనాలే ఉండాలని పాలసీ నిర్ణయం తీసుకున్న అందకనుగుణంగా ఇండియాలో ఇంకా ఎలాంటి సానుకూల విధానాలు రాలేదు. అందుకే చాలా కంపెనీలు ఈ రంగంలో అడుగుపెట్టడానికి వెనకాడుతున్నాయి. టెస్లా వంటి కంపెనీలు దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై పన్నులు తగ్గించాలని కోరుతున్నాయి. ప్రభుత్వం ముందుకు రావడం లేదు. దీంతో సహజంగానే కంపెనీలు రాయితీలు కోసం పక్కదేశాలతో మంత్రాంగం జరుపుతున్నాయి. 


ev gadkari latest news

Expert's View


ఏ దేశ ద్రవ్యోల్బణం చూసినా ఏముంది గర్వకారణం ?

Trending