ఇండియా లిస్టెడ్ కంపెనీల జోరు.. మార్కెట్ క్యాప్ అదుర్స్

2021-03-04 09:57:44 By Y Kalyani

img

ఇండియా లిస్టెడ్ కంపెనీల జోరు.. మార్కెట్ క్యాప్ అదుర్స్
మార్కెట్ క్యాప్ లో బిలియన్ డాలర్ల కంపెనీలు 335
ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయడానికి ఇంకేం కావాలి
ప్రాఫిట్ యువర్ ట్రేడ్ స్పెషల్ 

అత్యంత వేగంగా బిలియన్ డాలర్ మార్కెట్ క్యాప్ కంపెనీలు ఇండియాలోనే పెరుగుతున్నాయని తాజా లెక్కలు చెబుతున్నాయి. అవును... ఫస్ట్ టైమ్ 335 లిస్టెడ్ కంపెనీలు బిలియన్ డాలర్ టచ్ చేశాయి. ఈ విషయంలో జర్మనీ, ఫ్రాన్స్, కెనడా, సౌత్ కొరియా వంటి దేశాలను కూడా దాటేసింది ఇండియా. 
ప్రస్తుతం బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ కలిగిన కంపెనీలున్న దేశాల్లో ఇండియా 5వస్థానంలో ఉంది. నాలుగో స్తానంలో అడుగుపెట్టేందుకు వేగంగా పరుగులు తీస్తుంది. ప్రస్తుతం 4వస్థానంలో 351 కంపెనీలతో యూకే ఉంది. త్వరలోనే మనం ఈ స్థానం ఆక్రమించబోతున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 
టాప్ 20 కంట్రీస్ లో బెస్ట్ సెకండ్ పెర్మారన్స్ కంట్రీగా ఇండియా ఉంది. హాంకాంగ్ తర్వాత మన మార్కెట్ క్యాప్ 246 బిలియన్ డాలర్లు పెరిగింది.  టోటల్ మార్కెట్ క్యాప్ వచ్చేసి 2.77 ట్రిలియన్ డాలర్లుగా ఉంది.
 

కొత్తగా బిలియన్ డాలర్ల కంపెనీల జాబితాలో...
Hindustan Copper, Bajaj Electricals, IIFL Finance, Shriram City, BASF, NBCC, India Energy Exchange, IDFC, Railway Finance Corporation, Indigo Paints వంటి కంపెనీలు కూడా మార్కెట్లో బిలియన్ డాలర్ కంపెనీల లిస్ట్ లో యాడ్ అయ్యాయి. 
ప్రస్తుతం 56 కంపెనీలు 10 బిలియన్ డాలర్ల కు పైగా క్యాప్ కలిగి ఉన్నాయి. మూడు కంపెనీలు RIL, TCS, HDFC లు 100 బిలియన్ డాలర్ల క్యాపిటలైజేషన్ వద్ద ఉన్నాయి. 

దేశాల వారీగా చూస్తే...
అమెరికాలో 2780, చైనా 2135, జపాన్ 798, యూకే 351, ఇండియా 335, కెనడా 307, సౌత్ కొరియా 236, తైవాన్ 227, ఆస్ట్రేలియా 212, జన్మనీ 196, ఫ్రాన్స్ 163, స్విస్ 162 కంపెనీలు బిలియన్ డాలర్ మార్కెట్ క్యాప్ కలిగి ఉన్నాయి.  
 

Expert's View


WHAT IS BITCOIN ? HOW TO INVEST IN CRYPTO CURRENCY ?

Trending