ఫ్లాట్ మార్కెట్..ఐటీ స్టాక్స్‌లో భారీగా సెల్లాఫ్

2021-04-13 12:02:43 By Anveshi

img

స్టాక్ మార్కెట్లలో వీక్‌నెస్ స్పష్టమవుతోంది. నిఫ్టీ, సెన్సెక్స్‌లు ఆరంభలాభాలు కోల్పోయి ఫ్లాట్‌గా ట్రేడవడం ప్రారంభమైంది. నిఫ్టీ  20 పాయింట్ల లాభంతో14330 పాయింట్ల వద్ద, సెన్సెక్స్ 73 పాయింట్ల లాభంతో 31123 పాయింట్ల వద్ద ట్రేడ్ అయ్యాయ్. ఐతే  ఉదయం నష్టాల నుంచి నిప్టీ బ్యాంక్ తేరుకోవడంతోపాటు మెటల్ స్టాక్స్ షైనవ్వడంతో ఆ కౌంటర్లలో సందడి కన్పిస్తోంది. ఐతే  ఐటీ ఇండెక్స్‌లో భారీగా ప్రాఫిట్ బుకింగ్‌తో పాటు సెల్లాఫ్ చోటు చేసుకోవడంతో ఇండెక్స్‌ నష్టపోతోంది

టాప్ గెయినర్లలో మహీంద్రా అండ్ మహీంద్రా 5శాతం, బజాజ్ ఫైనాన్స్ 3.65శాతం, ఓఎన్‌జిసి 3.52శాతం, మారుతి సుజికి2.64శాతం పవర్ గ్రిడ్ కార్పొరేషన్ 2.61శాతం లాభపడ్డాయ్. 


లూజర్లలో టిసిఎస్, టెక్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, డా.రెడ్డీస్ ల్యాబ్స్, విప్రో స్టాక్స్ నాలుగున్నర నుంచి 3.20శాతం నష్టపోయాయ్.


nifty it stocks selloff profit book trade telugu stock market

Expert's View


ఒక స్టాక్ మల్టీ బ్యాగర్ అవ్వటానికి 20 సంవత్సరాలు పడుతుందా ?

Trending