బిగ్ బ్రేకింగ్.. భారత జీడీపీ రేట్ సవరించిన IMF

2021-07-27 23:14:16 By Y Kalyani

img

బిగ్ బ్రేకింగ్.. భారత జీడీపీ రేట్ సవరించిన IMF

ప్రస్తుతం ఆర్ధిక సంవత్సరంలో కొవిడ్ 19 అవుట్ బ్రేక్ కారణంగా ఆర్ధిక  జీడీపీ అంచనాలు తగ్గించింది అంతర్జాతీయ మానిటరీ ఫండ్. ఫైనాన్షియల్ ఇయర్ 22లో 9.5శాతానికి పరిమితం అవుతుందని తెలిపింది. అంతకుముందు ఇది 12.5శాతంగా అంచనా వేసింది. గ్లోబ్ ఫైనాన్షియల్ అవుట్ లుక్ రిపోర్ట్ విడుదల చేసింది IMF. మార్చి- మే మధ్యలో కరోనా తీవ్రంగా ప్రభావితం చేసింది. సెకండ్ వేవ్ వల్ల తీరని నష్టం జరిగింది. అటు రిజర్వ్ బ్యాంకు కూడా 9.5శాతం జీడీపీ అంచనా వేసింది. ఇక FY23లొ భారత వ్రుద్ధిరేటు 8.5శాతానికి పరిమితం అవుతుందని అంచనా వేసింది IMF.  ఏప్రిల్ ఫోర్ కాస్ట్ 6.9శాతం కంటే కంటే 160 బేసిస్ పాయింట్లు అధికంగా ఉంది. గ్లోబల్ రికవరీ మెరుగ్గా ఉన్నా కూడా పలు దేశాల్లో ఇంకా వ్యాక్సినేషన్ అంతరం వార్నింగ్ ఇస్తుందని గుర్తు చేసింది. 

గ్లోబల్ ఎకానమి...
FY21లో గ్లోబల్ జీడీపీ 6శాతంగా ఉందని ఐఎంఎఫ్ తెలిపింది. ముందుగా వేసిన అంచనాలు నిజమయ్యాయన్నారు. 2022లో తగ్గి 4.9శాతానికి పరిమితం అవుతుందని అంచనా వేస్తోంది. అగ్రదేశాల్లో గ్రోత్ రేట్ అంచనా వేసిన దానికంటే 0.5శాతం అదనంగా ఉందని IMF చీఫ్ ఎకనమిస్ట్ గీతా గోపీనాథ్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా వ్రుద్ధిరేటు స్థిరంగా ఉండాలంటే 40శాతం మంది ప్రజలకు వ్యాక్సినేషన్ అందాలంటోంది IMF.   వైరస్ మరియు దాని ఉత్పరివర్తనాల కారణంగా స్థిరమైన రికవరీ ఎక్కడా హామీ ఇవ్వలేమంటోంది. 


imf gdp gdp rate latest news

Expert's View


అవకాశం ఇచ్చిన tv5 నాయుడు గారికి | ఆదరిస్తున్న మీకు నా ధన్యవాదాలు

Trending