బుల్ ర్యాలీలో ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారా

2021-09-26 09:24:13 By Y Kalyani

img

బుల్ ర్యాలీలో ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారా
రికార్డు పరుగుల్లో ఏమరుపాటు మంచిదికాదు
కరెక్షన్ వచ్చినా మనీ గ్యారెంటీ
ప్రాఫిట్ యువర్ ట్రేడ్ స్పెషల్ స్టోరీ

స్టాక్ మార్కెట్ ఫుల్ జోష్ లో ఉంది. ఇంత భారీగా పెరిగినప్పుడు కరెక్షన్ కూడా ఉంటుందన్న భయం సహజం. ఈ సమయంలోనే ఇన్వెస్టర్లు తెలివిగా వ్యవహరించాలి. మరీ ముఖ్యంగా కొత్తగా మార్కెట్లోకి వచ్చినవాళ్లకు ఇదో సవాలు. వాస్తవానికి మార్కెట్ పడిపోయేంత పెద్ద ప్రమాద ఘంటికలు అయితే లేవు. చైనా ఎవర్ గ్రాండే సంక్షోభం కూడా ఎఫెక్ట్ చూపలేదు. అమెరికాలో కరోనా పెరుగుతోంది. అయినా కూడా ప్రభావం లేదు. ఇక దేశీయం పన్నుల వసూళ్లు బాగున్నాయని లేటెస్ట్ రిపోర్ట్ చెబుతోంది. కంపెనీల ఎర్నింగ్ సీజన్ కూడా భాగుందని సంకేతాలున్నాయి. ఈ నేపథ్యంలో భారీ కరెక్షన్ అవకాశాలు తక్కువే.. అయినా జాగ్రత్త మన బాధ్యత. ఈ సమయంలో కొన్ని నిర్ణయాలు తీసుకునుముందే అప్రమత్తంగా ఉండండి.

వాస్తవద్రుష్టితో చూడండి...
మార్కెట్లో ఇప్పుడు చూడాల్సింది వాస్తవాలు.  సహజంగానే మాక్రా ఏకానమీ బలంగా ఉంది. కంపెనీల ఎర్నింగ్స్ భాగున్నాయి. కార్యకలాపాలు నార్మల్గానే కాదు..పన్నుల ఆదాయం కూడా పెరిగింది. అటు కొన్ని సెక్టార్లు మెరుగ్గా రాణిస్తున్నాయి. కరెక్షన్ వచ్చినా ఆయా సెక్టార్లు కూడా పెద్దగా నష్టపోయే అవకాశం లేదు. అవేంటి అనేది మీ వెల్త్ మేనేజర్ తో చర్చించండి. 

భయపడొద్దు..
స్టాక్ మార్కెట్లో కరెక్షన్ ఛాన్స్ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో హై వాల్యుబుల్ స్టాక్స్ కూడా పడిపోవచ్చు. అయినా సరే మీరు చేయాల్సింది భయపడకుండా సహనంతో వేచి ఉండటం. ప్రస్తుతం పడిపోయినా.. ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉంటే మళ్లీ గోడకు కొట్టిన బంతిగా తిరిగివస్తుంది. 2020 అనుభవం మీకుంది. ఏమీ జరగదన్న అభయంతో ఉండండి.

లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకోండి.. 
టఫ్ టైం నిరంతరం ఉండదు.. కానీ టఫ్ పీపుల్ అన్నివేళలా సిద్దంగా ఉంటారు. అందుకే తాత్కాలికంగా వచ్చే సవాళ్లను అధిగమించడానికి సిద్దంగా ఉండండి. దీర్ఘకాలిక కోణంలో మీరు ఆలోచన చేసి.. పోర్ట్ ఫోలియోల విషయంలో వ్యవహరించింది.  2008 గడ్డు కాలం దాటాం.. 2020 మార్చిలో వచ్చిన కరెక్షన్లు చూశాం. అంతకంటే పెద్ద సంక్షోభాలు వచ్చేందుకు పెద్దగా ఛాన్స్ అయితే కనిపించడం లేదు. ఇన్వెస్టర్ గా మీరు మీ భావోద్వేగాలను ఈ స్టాక్స్ కు దూరంగా పెట్టండి. 

4. క్వాలిటీ....
లాస్ట్ బట్ నాట్ నెవర్ లీస్ట్.. క్వాలిటీ ఆఫ్ స్టాక్స్ అన్నింటి కంటే ముఖ్యం. ర్యాలీలో కొట్టుకొచ్చే పెన్నీ.. ఫండమెంటల్ లేని స్టాక్స్ వదిలించుకోండి.  నాయకత్వం, క్లీన్ మేనేజ్ మెంట్, నిర్వహణ ఉన్న కంపెనీల స్టాక్స్ హోల్డ్ చేయండి. 

సో ఈ జాగ్రత్తలు తీసుకోండి...కరెక్షన్ వచ్చినా కూడా మీ డబ్బుకు డోకా లేదు. మార్కెట్ ను ఎంజాయ్ చేయవచ్చు. 


market traders investors

Expert's View


ఇన్వెస్టర్లకు ఎనలిస్టుల "దసరా మాములు" స్టాక్ రెకమెండేషన్స్

Trending