భారీగా పెరిగిన ఐడీఎఫ్‌సీ షేర్లు

2021-07-22 11:16:30 By VANI

img

ఐడీఎఫ్‌సీ బ్యాంకు షేర్లు గురువారం భారీగా పెరిగాయి. ఐడీఎఫ్‌సీ ఐదేళ్ల లాక్-ఇన్ వ్యవధి ముగియడంతో ఫస్ట్ బ్యాంక్ ప్రమోటర్‌గా నిష్క్రమించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) అనుమతించినట్లు కంపెనీ తెలిపింది. దీంతో ఐడీఎఫ్‌సీ షేర్లు గురువారం ఇంట్రా-డే ట్రేడ్‌లో బీఎస్‌ఈలో 52 వారాల గరిష్ట స్థాయి 62.60 రూపాయలకు చేరుకున్నాయి. నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ స్టాక్ 2021 మే 25 న మునుపటి గరిష్ట స్థాయి 60.25 ను అధిగమించింది.

 

ఐడీఎఫ్‌సీ ప్రస్తుతం ఐడీఎఫ్‌సీ ఫైనాన్షియల్ హోల్డింగ్ కంపెనీలో 100 శాతం వాటాను సొంతం చేసుకుంది. ఇది ఐడీఎఫ్‌సీ అసెట్ మేనేజ్‌మెంట్‌లో 100 శాతం, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌లో 36.6 శాతం వాటాను కలిగి ఉంది. "లాక్-ఇన్ వ్యవధి 5 సంవత్సరాల గడువు ముగిసిన తరువాత, ఐడీఎఫ్‌సీ లిమిటెడ్ ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ లిమిటెడ్ ప్రమోటర్‌గా నిష్క్రమించవచ్చు’’ అని జూలై 20 న ఆర్‌బీఐ స్పష్టం చేసిందని బీఎస్ఈకి ఇచ్చిన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఐడీఎఫ్‌సీ తెలిపింది.


IDFC bank