ఏథర్ ఎనర్జీలో హీరో పెట్టుబడికి లైన్ క్లియర్

2022-01-14 21:38:53 By Y Kalyani

img

ఏథర్ ఎనర్జీలో హీరో పెట్టుబడికి లైన్ క్లియర్ 

ప్రపంచంలోనే అతిపెద్ద మోటార్‌సైకిళ్లు మరియు స్కూటర్ల తయారీ సంస్థ ఇండియన్ కంపెనీ హీరో మోటోకార్ప్ కీలక ప్రకటన చేసింది. ఏథర్ ఎనర్జీలో రూ. 420 కోట్లు కొత్తగా పెట్టుబడి పెడుతున్నట్టు వెల్లడించింది. ప్రతిపాదిత పెట్టుబడికి ముందు Ather ఎనర్జీలో Hero MotoCorp కు 34.8శాతం వాటా ఉంది. తాజా పెట్టుబడి తర్వాత ఎనర్జీ సంస్థలో హీరో కంపెనీ స్టేక్ ఇంకా పెరుగుతుంది. ఏథర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తుంది. ఇటీవల కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు రూ. 5,500 వరకూ పెంచుతున్నట్టు ప్రకటించింది. ఏథర్ ఎనర్జీతో కలిసి హీరో ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీ మరియు సోర్సింగ్ వంటి వివిధ రంగాలలో కొత్త అవకాశాలను అన్వేషిస్తుందని కంపెనీ తెలిపింది.

మార్చిలో హీరో ఈవీ

అటు హీరో మోటోకార్ప్ తన మొదటి ఎలక్ట్రిక్ వాహనాన్ని ఈ ఏడాది మార్చి నెలలో ఆవిష్కరించడానికి సిద్ధమవుతోంది. కంపెనీ R&D సెంటర్ జైపూర్‌లోని సెంటర్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ (CIT)లో ఈవీని డెవలప్ చేస్తోంది. అటు జర్మనీలోని మ్యూనిచ్ వద్ద ఉన్న టెక్ సెంటర్  (TGG)లో కూడా దీనిపై రీసెర్చ్ చేస్తోంది.  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా శ్రీ సిటీలో కంపెనీ ఈవీ స్కూటర్లు ఉత్పత్తి చేయనుంది. 


hero two wheeler trading invest latest news