అంచనాలు అందుకున్న HCL

2022-01-14 21:53:07 By Y Kalyani

img

అంచనాలు అందుకున్న HCL

అతిపెద్ద IT సర్వీస్ కంపెనీల్లో ఒకటైన HCL టెక్నాలజీస్ లిమిటెడ్ డిసెంబర్ 2021తో ముగిసిన మూడో త్రైమాసికానికి Q3FY22 ఆర్థిక ఫలితాలు వెల్లడించింది. రూ. 3,442 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ PATఅంటే పన్నుల చెల్లింపుల తర్వాత నెట్ ప్రాఫిట్ రూ. 3,969 కోట్లుగా నివేదించింది. అంతకు ముందు అంటే FY22 రెండో త్రైమాసికంలో PAT రూ. 3,259 కోట్లుగా ఉంది. సెప్టెంబర్-డిసెంబర్ కాలంలో కంపెనీ ఆదాయం రూ. 22,331 కోట్లుగా ఉంది. గత ఏడాది త్రైమాసికంతో పోలిస్తే 15.7 శాతం పెరిగింది. అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే 8.1 శాతం గెయిన్ అయింది. గత ఏడాది ఇదే కాలంలో ఏకీకృత ఆదాయం రూ. 19,302 కోట్లు కాగా, క్రితం త్రైమాసికంలో రూ. 20,655 కోట్లుగా ఉంది. డాలర్ రూపంలో చూస్తే ఆదాయం 2.98 బిలియన్ల డాలర్లకు చేరుకుంది. ఇది వార్షిక ప్రాతిపదికన 13.8 శాతం మరియు వరుసగా 6.7 శాతం పెరిగింది. డిసెంబర్ 2017 నుండి డిసెంబర్ 2021 వరకు ఐదేళ్ల కాలంలో డాలర్ పరంగా కంపెనీకి ఆదాయాలు 10.6 శాతం పెరుగుతూ వచ్చాయి. 
డిజిటల్, క్లౌడ్ & ఇంజినీరింగ్ వంటి వ్యూహాత్మక ప్రాధాన్యతలపై పెట్టుబడులు పెట్టడంతో పాటు రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ పై ఫోకస్ పెట్టినట్టు కంపెనీ తెలిపింది.  త్రైమాసికంలో కంపెనీ మంచి ఆర్డర్ బుక్ సాధించింది. 2.1 బిలియన్ల డాలర్ల విలువైన కొత్త ఒప్పందాలపై సంతకం చేసింది.  
 


hcl it company tech result q3 result