HCL విస్తరణకు లేటెస్ట్ ప్లానింగ్

2022-05-12 22:21:50 By Y Kalyani

img

HCL విస్తరణకు లేటెస్ట్ ప్లానింగ్

ఉన్నచోటే ఉంటే ఏముంటుంది... కొతకొత్త ప్రాంతాల్లో అడుగు పెడుతే లోతు తెలుస్తుందంటారు. ఇదే ఫార్ములా అమలుచేస్తోంది HCL టెక్నాలజీస్. నార్త్ ఏసియా, మిడిల్ అమెరికా, ఈస్ట్ యూరప్ మరియు ఆఫ్రికాల్లో కంపెనీ విస్తరించాలని భావిస్తోంది. కొత్త భౌగోళిక ప్రాంతాలుగా చూస్తోంది. కంపెనీ ఇప్పటికే ఉన్న చోటే కాకుండా ఇతర  కొత్త మార్కెట్లలో కూడా వృద్ధి చెందాలనేది ప్రణాళికలో భాగంగా కొత్తగా ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అవుతున్నట్టు కంపెనీ ఛైర్‌పర్సన్, రోష్ని నాడార్ మల్హోత్రా ప్రకటించారు. కోవిడ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా డిజిటల్, ఐటీ రంగంలో డిమాండ్ పెరిగింది. అంతేకాదు అవసరాలు పెరిగాయి. దీంతో అందిపుచ్చుకోవడానికి HCL ఇదే సరైన సమయంగా భావిస్తోంది. మేము ఇప్పటికే US, UK మరియు ఆస్ట్రేలియా వంటి మార్కెట్లలో బలంగా ఉంది.

పెరిగిన ఆదాయం...
HCL టెక్నాలజీస్ FY22లో 11.48 బిలియన్ డాలర్ల ఆదాయం సాధించింది. గత ఏడాదిలో పొల్చితే 12.8 శాతం పెరుగింది. నికర లాభం 1.8 బిలియన్ డాలర్లుగా ఉంది. 4.3 శాతం పెరిగింది. ఆర్థిక సంవత్సరానికి EBITDA మార్జిన్ 24 శాతంగా ఉంది.


hcl it company tech result result

Expert's View


ఏ దేశ ద్రవ్యోల్బణం చూసినా ఏముంది గర్వకారణం ?

Trending