-->

ప్రభుత్వ సెక్యూరిటీ బాండ్స్ రికార్డ్ అవుట్ ఫ్లో

2021-01-11 07:53:02

img

ప్రభుత్వ సెక్యూరిటీ బాండ్స్ రికార్డ్ అవుట్ ఫ్లో

గిల్ట్ ఫండ్స్ నుంచి డిసెంబరులో రిడంప్షన్ రికార్డు స్థాయిలో నమోదు అయింది. ప్రభుత్వం సెక్యూరిటీ బాండ్స్ నుంచి ఇన్వెస్ట్రర్లు వెనక్కు తీసుకున్నారు. నెట్ అవుట్ ఫ్లోస్ రూ.1802 కోట్లుగా ఉంది. మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నివేదిక వెల్లడించింది. కొత్తగా ఇన్ ఫ్లోస్ కేవలం రూ.1483 కోట్లు కాగా... అవుట్ ఫ్లోస్ రూ.3287 కోట్లుగా ఉంది. అంతకుముందు నెల నవంబర్ తో పోల్చితే దాదాపు రెట్టింపు ఉంది. నవంబరులో రిడంప్షన్ వాల్యూ రూ.1471 కోట్లుగా ఉంది. లాభాలు పెద్దగా లేకపోవడంతో ప్రభుత్వం సెక్యూరిటీస్ పట్ల మదుపుదారులు ఆసక్తిచూపడం లేదు. అత్యల్పంగా లాభాలు కనిపించడంలో టేబుల్ ప్రాఫిట్స్ తీసుకుని బయటపడుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. గడిచిన ఏడాదిలో గిల్డ్ ఫండ్స్ యావరేజ్ ఆదాయం 11.99శాతం మాత్రమే. పదేళ్ల యావరేజ్ ఆదాయం 6.57శాతం నుంచి 5.89శాతానికి పడిపోయింది.