ఊగిసలాటలో బంగారం ధరలు
పెట్టుబడికి మంచి సమయమేనా
అంతర్జాతీయంగా బంగారం ధరలపైనా అనిశ్చితి కనిపిస్తోంది. ధరలు ఎప్పుడు పెరుగుతాయో, ఎప్పుడు తగ్గుతాయో అర్థం కావడం లేదు. వరసగా నాలుగోరోజూ ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి.
22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.45,750 ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.300 తగ్గింది. 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ49,00 ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.330 తగ్గింది.
బంగారం ధరలు ఆగస్టు నుంచి తగ్గుముఖం పట్టాయి. ఆగస్టు 17న 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,670గా ఉంటే.. ప్రస్తుతం రూ.45,800గా ఉంది. అంటే 5 నెలల్లో రూ.6వేలకు పైగా తగ్గింది పసిడి ధర. ఆగస్టు 2020లో ఓసారి ఇది 52600 వద్ద ట్రేడ్ అయింది. ఈ గరిష్ట రికార్డు స్థాయి ధరతో పోల్చితే సుమారు 7500 తగ్గింది. డిసెంబరు తర్వాత గోల్డ్ ధరలు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి.
అటు నేటి వెండి ధర ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.70,700 ఉంది. నిన్నటితో పోలిస్తే వెండి ధర రూ.600 తగ్గింది.
ఇన్వెస్ట్ చేయవచ్చా....
పుత్తడిని కొనుగోలు చేసి పెట్టుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. బడ్జెట్తో పాటు వచ్చేది పెళ్లిళ్ల సీజన్ కావడంతో మరింత పెరిగే అవకాశముంది. పైగా మార్కెట్లో అనిశ్చితి కారణంగా డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. కొద్దిరోజులుగా మార్కెట్లో బేరిష్ కనిపిస్తోంది. దీంతో ఇన్వెస్టర్లు సేఫ్ హెవెన్ అయిన గోల్డ్ వైపు మళ్లుతారు. బంగారం ధర ఏడాదిలో రూ.60వేల వరకూ వస్తుందని అంచనా వేస్తున్నాయి ఇన్వెస్ట్మెంట్ ఏజెన్సీలు. మరి మీ దగ్గర ఉన్న కేపిటల్ ను బంగారంలోకి కొంత మళ్లిస్తే రాబడి ఉండే అవకాశం ఉందని అంటున్నారు.