గోల్డ్ చాలా కాస్ట్లీ గురూ.. భరించలేనంత

2021-11-25 22:52:02 By Y Kalyani

img

గోల్డ్ చాలా కాస్ట్లీ గురూ.. భరించలేనంత 
GST పెంచాలన్న కమిటీ
ఆందోళనలు వ్యాపారవర్గాలు

బంగారం, వెండి నగల ధరలు పెరిగనున్నాయి. జీఎస్టీ రేట్లను సవరించనున్నారట. ఫిట్‌మెంట్‌ కమిటీ సూచనల్లో భాగంగా బంగారం, వెండిపై ప్రస్తుతం విధిస్తున్న జీఎస్టీ రేటును కూడా పెంచాలని ప్రతిపాదించింది. ప్రస్తుతం ఐదు శాతంగా ఉన్న జీఎస్టీ రేటును 7 శాతానికి, 18 శాతంగా ఉన్న స్లాబ్‌ రేటును 20 శాతానికి పెంచాలని ఈ కమిటీ సూచించింది. అలాగే వేర్వేరుగా ఉన్న 12, 18 శాతం స్లాబ్‌ రేట్లను కలిపి 17 శాతం చేయాలన్న ప్రతిపాదన కూడా చేసింది. బంగారం, వెండి వస్తువులపై 3 శాతంగా ఉన్న జీఎస్టీ రేటును 5 శాతానికి పెంచాలని ఈ కమిటీ సూచించింది. మంత్రులతో కూడిన ఉపసంఘం ఆమోదించిన తర్వాతే అమల్లోకి వస్తుంది. నవంబర్‌ 27న సమావేశం కానుంది. ఈ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 
జీఎస్టీ రేటును సవరించాలన్న నిర్ణయంపై బంగారం, వెండి వ్యాపారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కొవిడ్‌ లాక్‌డౌన్‌, హాల్‌మార్కింగ్‌ తప్పనిసరి నిర్ణయాలతో వ్యాపారం అంతంతమాత్రంగానే ఉంది. పెళ్లిళ్ల సీజన్‌ కారణంగా గత రెండు నెలల నుంచి కాస్త అమ్మకాలు కుదుటపడుతున్నాయి. జీఎస్టీ పెంచితే ధరలు పెరిగి అమ్మకాలు తగ్గుతాయని భాధపడుతున్నాయి వ్యాపారవర్గాలు. బంగారం బ్లాక్‌ మార్కెట్‌ కూడా పెరుగుతుందని అంటున్నారు.


gold demand latest news

Expert's View


మంచి కంపెనీల IPO లకు ఎందుకు ఆదరణ కరువైంది ?

Trending