గోల్డ్ ధరలు ఇంకా తగ్గుతాయా... మళ్లీ పెరుగుతాయా

2021-05-04 09:12:30 By Y Kalyani

img

గోల్డ్ ధరలు ఇంకా తగ్గుతాయా... మళ్లీ పెరుగుతాయా

బంగారం ధరలు తగ్గుతాయంటున్నారు నిపుణులు. గడిచిన 11 రోజుల్లో 7 రోజులు ధరలు తగ్గాయి. 2 రోజులు స్థిరంగా ఉన్నాయి. మరో 2 రోజులు పెరిగాయి. 22 క్యారెట్ల బంగారంపై 10 రోజుల్లో 10 గ్రాములపై రూ.1100 వరకూ తగ్గింది. అలాగే 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 10 గ్రాములు రూ.1200 తగ్గింది. ఇంకా తగ్గుతుందనే అంచనా ఉంది. అయితే ఇవాళ తాజాగా బంగారం ధరల్లో పెరుగుదల కనిపించింది. ఇందుకు ప్రధాన కారణం కొనుగోళ్లు ఊపందుకుకోవడం.  చాలా కాలంగా బంగారం కొనకుండా ఉన్నవాళ్లు మళ్లీ కొనడం ప్రారంభించారు. పెళ్లిళ్ల సీజన్ వస్తుండటమే కారణం. ఇప్పుడు కొనకపోతే... మళ్లీ పెరుగుతుందేమో అనే భయం ఉంది. అయితే దేశంలో బంగారం ధరలు తగ్గే సంకేతాలు బలంగా ఉన్నాయంటున్నారు. 
నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.44,000 ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర 10 గ్రాములు రూ.48,000 ఉంది. 
ఇక వెండి ధరలు నిన్న కొద్దిగా పెరిగాయి. గత 30 రోజుల్లో వెండి ధర కేజీకి రూ.3,790 పెరిగింది. తాజాగా కేజీ వెండి ధర రూ.73,500 వద్ద ఉంది. నిన్న సోమవారం ధర రూ.700 పెరిగింది. 6 నెలల కిందట నవంబర్ 4న వెండి ధర కేజీ రూ.66,300 ఉంది. ఇప్పుడు రూ.73,500 ఉంది. అంటే రూ.7,200 పెరిగింది. 


gold price silver profit stocks gold bonds gold price

Expert's View


ఒక స్టాక్ మల్టీ బ్యాగర్ అవ్వటానికి 20 సంవత్సరాలు పడుతుందా ?

Trending