మార్కెట్ ఢమాల్.. బంగారం బెటరా

2022-05-12 22:41:51 By Y Kalyani

img

మార్కెట్ ఢమాల్.. బంగారం బెటరా

స్టాక్ మార్కెట్ లో బేర్ పట్టు బిగిస్తోంది. ఇన్వెస్టర్లలో ఒత్తిడి కనిపిస్తోంది. అటు FIIలు అమ్మకాల ఒత్తిడిలో ఉన్నారు. ద్రవ్యోల్బణం ఆందోళనలు, బలహీనమైన అంతర్జాతీయ సంకేతాల మధ్య మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ఈ సమయంలో డబ్బు ఎక్కడ పెట్టాలన్న టెన్షన్ ఇన్వెస్టర్లలో సహజం. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులకు మరోసారి గోల్డ్ సేఫ్ హెవెన్ గా కనిపిస్తోంది. 

బంగారం మరియు వెండి ధరలు తగ్గుతున్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ 50803, 0.19% తగ్గాయి మరియు జూలై వెండి అధిక డాలర్ ఇండెక్స్ ధరల కారణంగా ఈరోజు 0.68% తగ్గి 60338 వద్ద ట్రేడవుతోంది.  గోల్డ్ ఫ్యూచర్స్ కంటిన్యూస్ కరెంట్ కాంట్రాక్టును పరిశీలిస్తే, ఇది సమీప కాలంలో 52,179 స్థాయిలను తాకవచ్చు. వినియోగదారులు స్వల్పకాలంలో రూ. 50,198 స్టాప్ లాస్‌తో మరియు 52,198 టార్గెట్‌తో బంగారాన్ని కొనుగోలు చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. 
మొత్తానికి ఇండియన్స్ కు సహజంగానే గోల్డ్ అంటే అమితాసక్తి. కాబట్టి మార్కెట్లు కూడా అంతగా అనుకూలంగా లేవుకాబట్టి ప్రస్తుతం వారి ఫోకస్ గోల్డ్ వైపు మళ్లుతోంది. 


gold imports price gold price

Expert's View


ఏ దేశ ద్రవ్యోల్బణం చూసినా ఏముంది గర్వకారణం ?

Trending